డిసెంబర్ 5న విడుదల కానున్న అఖండ 2 సినిమా టికెట్ ధరలను ఏపీ ప్రభుత్వం పెంచడంపై సీపీఐ నాయకుడు నారాయణ తీవ్రంగా స్పందించారు. ప్రీమియర్లకు రూ. 600, థియేటర్లలో అదనంగా రూ 75–₹100 పెంపు ప్రజలపై భారం మోపుతుందని, ఇలాంటి చర్యలే పైరసీకి దారితీస్తాయని ఆయన విమర్శించారు. వందల కోట్లు పెట్టి సినిమాలు తీసి ప్రజల జేబులకు తూటాలు పొడవడం సరికాదన్నారు. పైరసీని అరికట్టే నైతిక హక్కు ప్రభుత్వానికి, పోలీసులకు లేదని నారాయణ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa