టాలీవుడ్ హీరో నాగచైతన్య తన తొలి వెబ్‌సిరీస్ 'దూత' రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో స్పందించారు. నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని, 'దూత' అది నిరూపించిందని ఆయన అన్నారు. ఈ సిరీస్‌ను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ 2023 డిసెంబరు 1న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ప్రస్తుతం నాగచైతన్య 'వృషకర్మ' చిత్రంలో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa