ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత!

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 01, 2025, 02:31 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో సారి పెళ్లి చేసుకుంది. కొంతకాలంగా డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆ వార్తలను నిజం చేస్తూ సమంత అతడినే వివాహమాడినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ (డిసెంబర్ 1) ఉదయం కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో వీరు పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. కాగా పెళ్లికి సంబంధించి ఈ జంట త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa