తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మంచు కుటుంబ కలహాలపై మంచు లక్ష్మి తాజాగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమ కుటుంబం మళ్లీ ఒకటవ్వాలని దేవుడిని కోరుకుంటానని అన్నారు. ఏ కుటుంబంలోనైనా గొడవలు సహజమని, కానీ, రక్త సంబంధాలను కాపాడుకోవడమే ముఖ్యమన్నారు. అప్పట్లో తాను స్పందించనందుకు చాలామంది తనను తప్పుగా అర్థం చేసుకున్నారని, కానీ ఆ బాధ తనకు మాత్రమే తెలుసని, ఆ ఘటనలు తనను తీవ్రంగా బాధించాయని ఆమె ఎమోషనల్ అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa