డిసెంబర్ 19న విడుదల కానున్న జేమ్స్ కామెరూన్ 'అవతార్ 3' చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా భారత్‌లో అద్భుత వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' మొదటి రోజు రూ. 39.90 కోట్లు వసూలు చేసి, 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' తర్వాత అత్యధిక ఓపెనింగ్ సాధించిన హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. అయితే, 'అవతార్ 3' ముందస్తు బుకింగ్‌లు నెమ్మదిగా ఉన్నప్పటికీ, మొత్తం వసూళ్లు రూ. 500 కోట్లు దాటవచ్చని అంచనా. ఈసారి కలెక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa