‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీతో కలిసి చేస్తున్న చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ కాకుండా ట్రిపుల్ రోల్లో కనిపించనున్నారని తాజా సమాచారం. ఇది సోషియో-ఫాంటసీ జానర్లో, మూడు లోకాల మధ్య జరిగే కథతో తెరకెక్కుతోందని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. 2027 సమ్మర్లో విడుదలయ్యే ఈ చిత్రంలో దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న (విలన్గా) నటిస్తున్నారు. అభిమానులు ఈ సినిమా రూ. 2000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధిస్తుందని ఆశిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa