ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్ నేరగాళ్ల వలలో పడకండి: రకుల్ ప్రీత్ సింగ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 12:58 PM

ఇటీవల కాలంలో సోషల్ మీడియా మోసాలు పెరిగిపోవడంతో సినీ తారలు సైబర్ నేరగాళ్ల బాధితులుగా మారుతున్నారు. హీరోయిన్ల పేరుతో నకిలీ అకౌంట్లు సృష్టించి మోసాలకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది.తన పేరుతో జరుగుతున్న ఈ మోసాన్ని తీవ్రంగా పరిగణించిన రకుల్ ప్రీత్ సింగ్, వెంటనే తన అభిమానులనుద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాట్సాప్‌లో ఎవరో తన పేరును ఉపయోగించి ప్రజలతో చాటింగ్ చేస్తున్నారని, అయితే ఆ నంబర్ తనది కాదని ఆమె స్పష్టం చేశారు. “హాయ్ గైస్.. ఎవరో వాట్సాప్‌లో నా పేరుతో ప్రజలతో చాట్ చేస్తున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. దయచేసి ఇది నా నంబర్ కాదని గమనించండి. ఎవరూ ఆ నంబరుతో చాటింగ్ చేయకండి. దయచేసి ఆ నంబర్ బ్లాక్ చేయండి” అని రకుల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తన పేరుతో చాట్ చేస్తున్న ఆ నకిలీ వాట్సాప్ నంబర్‌ను వెంటనే బ్లాక్ చేయాలని, ఆ నంబర్‌కు ఎవరూ మెసేజులు పంపవద్దని ఆమె అభిమానులకు గట్టిగా సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa