బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్, తన ప్రేమకథ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'రామ్ లీలా' సినిమా షూటింగ్ ఉదయపుర్లో జరుగుతున్నప్పుడు దీపికా పదుకొణెతో ప్రేమలో పడినట్లు తెలిపారు. ఆ ఊరు ప్రేమకథలకు అదృష్టమని, తమ ప్రేమకు గుర్తుగా పాప పుట్టిందని అన్నారు. 2013లో 'రామ్ లీలా'తో వీరిద్దరూ కలిసి పనిచేయడం ప్రారంభించారు, 2018లో వివాహం చేసుకున్నారు. గతేడాది వీరికి పాప జన్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa