నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో శుక్రవారం విడుదలైన ‘ప్రేమంటే’ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుందని హీరో ప్రియదర్శి అన్నారు. పెళ్లి తర్వాత ప్రేమ అసలు రూపం తెలుస్తుందని, ఈ సినిమాలో ప్రేమ అందంగా ఎలా ఉంటుందో, ఎలా మారుతుందో చూపించామని తెలిపారు. ఇద్దరు ప్రేమికులు తమ సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ప్రియదర్శి ప్రస్తుతం ‘అసమర్ధుడు’ పొలిటికల్ డ్రామా, ‘సుయోధన’ థ్రిల్లర్ చిత్రాల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa