దర్శకుడు రాజమౌళి–మహేష్ బాబు సినిమా వారణాసి టైటిల్ వివాదంలో చిక్కుకుంది. ఈ టైటిల్‌ను రామభక్త హనుమా క్రియేషన్స్‌కు చెందిన చిరపురెడ్డి సుబ్బారెడ్డి 2023 జూలైలో రిజిస్టర్ చేశానని, 2026 జూలై వరకు హక్కులు తమవేనని వెల్లడించారు. ఈ మేరకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ఇచ్చిన కాపీని కూడా ఆయన రిలీజ్ చేశారు. దీంతో వారణాసి టైటిల్ చిక్కుల్లో పడింది. అయితే, 'SS రాజమౌళీస్ వారాణాసి' అనే టైటిల్‌తో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa