ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళ ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్న రోజా

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 06, 2025, 05:21 PM

మాజీ మంత్రి రోజా మళ్లీ ఇండస్ట్రీలో సందడి చేయబోతున్నారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయాలకు తాత్కాలికంగా దూరమైన ఆమె, తన సినీ కెరీర్‌పై దృష్టి సారించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఓ తమిళ చిత్రంతో ఆమె గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ వార్తతో ఆమె అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.తమిళ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ‘లెనిన్ పాండ్యన్’ చిత్రంలో రోజా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. డి.డి. బాలచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రోజా రీ-ఎంట్రీని ప్రకటిస్తూ ఆమె స్నేహితురాలు, నటి ఖుష్బూ ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. 90ల నాటి రోజా హిట్ సినిమాల్లోని క్లిప్స్‌తో పాటు, కొత్త సినిమాలోని ఆమె లుక్‌ను ఈ వీడియోలో చూపించారు. "90s క్వీన్ ఈజ్ బ్యాక్" అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa