ఈ ఏడాది అత్యంత వివాదాస్పద చిత్రాల్లో ఒకటైన 'బ్యాడ్ గర్ల్' సినిమా మంగళవారం అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. యువతను పెడదోవ పట్టించేలా ఉందని విమర్శలు ఎదుర్కొన్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు కూడా కట్ చెప్పింది. థియేటర్లలో యువత నుంచి మంచి ఆదరణ పొందిన ఈ బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీని ప్రముఖ దర్శకులు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ నిర్మించారు. వర్ష భరత్ తెరకెక్కించిన ఈ సినిమాలో అంజలి శివరామన్, శరణ్య రవిచంద్రన్ నటించారు. ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa