ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మా ఇంటి బంగారం' లో విలన్ గా కాంతారా విలన్

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 07:39 PM

ప్రముఖ నటి సమంత ఇటీవలే నందిని రెడ్డితో తన కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'మా ఇంటి బంగారం' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రంలో ఇటీవలే సంచలనాత్మక బాక్సాఫీస్ విజయం సాధించిన కాంతారా: చాప్టర్ 1లో విలన్‌గా నటించిన గుల్షన్ దేవయ్య ఇప్పుడు తొలిసారిగా తెలుగు చిత్రసీమలోకి ఈ సినిమాతో అడుగుపెడుతున్నాడు. గుల్షన్ ఇన్‌స్టాగ్రామ్‌లో "నేను కూడా ఉన్నాను" అని పోస్ట్‌ను పంచుకున్నాడు. అయితే అతని పాత్రకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభ దశలో ఉంది. ఈ చిత్రాన్ని సమంత నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa