కోబాల్ట్ బ్లూలో పాత్రకు ప్రసిద్ధి చెందిన అంజలి శివరామన్ నటించిన తమిళ చిత్రం 'బాడ్ గర్ల్' కి వ్యాషా భారత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని వెట్రీ మరాన్ మరియు అనురాగ్ కశ్యప్ నిర్మించారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జియోహాట్ స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం నవంబర్ 4 నుండి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళంలో ప్రసారానికి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో శాంతి ప్రియా, సరన్య రవిచంద్రన్, హ్రిధు హారూన్, టీజయ్ అరుణసలాం కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అమిత్ ట్రివెడి సంగీతం స్వరపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa