కన్నడ నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ దివ్య సురేశ్‌పై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బెంగళూరులో ఈ నెల 4న అర్ధరాత్రి సమయంలో కారుతో బైకును ఢీకొట్టి, ఆపకుండా వెళ్లిపోయారని బాధితులు ఫిర్యాదు చేశారు. బైక్‌పై ముగ్గురు ఉండగా అనిత అనే యువతి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కారును సీజ్ చేశారు. ఆ సమయంలో దివ్య కారు నడిపినట్లు గుర్తించారని సమాచారం. కాగా యాక్సిడెంట్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa