హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై నటుడు మోహన్‌బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'హైదరాబాద్-బెంగళూరు హైవేపై జరిగిన బస్సు దుర్ఘటన గురించి విని చాలా బాధపడ్డాను. క్షణాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇది మాటలకందని విషాదం. కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా' అని మోహన్‌బాబు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa