ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'థామా' డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 10:47 AM

మాడాక్ హర్రర్ కామెడీ యూనివర్స్‌లో 'థామా' చిత్రం అక్టోబర్ 21, 2025న విడుదల అయ్యింది. ఈ సినిమాకి విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖుర్రానా మరియు రష్మికా మాండన్న ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా డిసెంబర్ 2న డిజిటల్ ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పరేష్ రావల్ మరియు నవాజుద్దీన్ సిద్దికి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి  స్క్రీన్ ప్లేని నైరెన్ భట్, అరుణ్ ఫ్యులారేరా మరియు సురేష్ మాథ్యూ రాశారు. ఈ ప్రాజెక్టును మాడాక్ ఫిల్మ్స్ మరియు జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa