ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ప్రేమంటే' లో పోలీస్ గా సుమ

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 03:20 PM

నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు ప్రియదర్శి తన కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ప్రేమంటే' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో ప్రియదర్శి కి జోడిగా ఆనంది నటిస్తుంది. ప్రముఖ నటి మరియు యాంకర్ సుమ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి సుమ కనకాల యొక్క గ్లింప్సెని విడుదల చేసారు. ఈ చిత్రంలో నటి పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఎస్‌విసిఎల్‌ఎల్‌పి) మరియు స్పిరిట్ మీడియా బ్యానర్‌లపై రానా దగ్గుబాటి సమర్పణలో సునీల్ మరియు భరత్ నారంగ్ మార్గదర్శకత్వంలో జాన్వీ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa