యువ దర్శకుడు కీర్తిస్వారాన్ దర్శకత్వంలో కోలీవుడ్ యువ నటుడు-దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ తెలుగు తమిళ ద్విభాషా చిత్రానికి మేకర్స్ 'డ్యూడ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం యొక్క ప్రమోషనల్ కంటెంట్ కి సానుకూల స్పందన వచ్చింది. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషలలో దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న విడుదల కానుంది. ఈ చిత్రంలో మామిత బైజు మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సీనియర్ నటులు శరత్ కుమార్, రోహిని మొల్లెటి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని ప్రత్యంగిరా సినిమాస్ బ్యానర్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క నార్త్ అమెరికా ప్రీమియర్స్ ప్రీ సేల్స్ $100K మార్క్ కి చేరుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. సాయి భాంక్కర్ ఈ చిత్ర సంగీత స్వరకర్తగా ఉన్నారు. ఈ చిత్రాన్ని మైథ్రీ మూవీ మేకర్స్ బ్యానర్ క్రింద నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa