టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, తన గత చిత్రం 'లైలా' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్పందన రాకపోవడంతో ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పి, మంచి సినిమాలు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన 'ఫంకీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదలయ్యాక మంచి బజ్ నెలకొంది. ముఖ్యంగా టీజర్‌లోని విశ్వక్ సేన్ డైలాగ్ డెలివరీ, కామెడీ అందరినీ ఆకట్టుకున్నాయి. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. 'ఫంకీ' వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa