బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత, మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కలయికలో రాబోతున్న కొత్త సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను నవంబర్ 5వ తేదీన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవి సరసన మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటించనుంది. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాశీ ఖన్నా కూడా ఈ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa