యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ మాస్ మహారాజ రవితేజతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవితేజ బయోపిక్ తీయాలని గతంలో సీరియస్‌గా ప్లాన్ చేశానని తెలిపారు. రవితేజ జర్నీ తనకు ఇన్‌స్పైరింగ్‌గా అనిపించిందని అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పారు. దీనిపై స్పందించిన రవితేజ బయోపిక్‌లలో నెగెటివ్ కోణాన్ని కూడా చూపించాలని అప్పుడే అది నిజంగా అనిపిస్తుందని అన్నారు. తాను కూడా ఒక నటుడి బయోపిక్ తీసే ఆలోచనలో ఉన్నానని కానీ ఆ నటుడు ఎవరో చెప్పలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa