ప్రముఖ నటుడు విష్ణు విశాల్ రాబోయే క్రైమ్ థ్రిల్లర్ 'ఆర్యన్' లో కనిపించనున్నారు. ప్రవీణ్ కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క టీజర్ ని విడుదల చేయగా భారీ స్పందన లభించింది. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని ఇమ్ ది గయ్ అనే టైటిల్ తో ఈరోజు సాయంత్రం 6:05 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ మరియు మనాసా చౌదరి మహిళా లీడ్స్ గా కనిపించనున్నారు. సినిమాటోగ్రాఫర్ గా హరీష్ కన్నన్ మరియు సంగీత దర్శకుడుగా గిబ్రాన్ ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కానుంది. విష్ణు విశాల్ స్టూడియోజ్, షుబ్రా మరియు ఆర్యన్ రమేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa