ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన 'కన్నప్ప' జూన్ 27, 2025 బహుళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రీతి ముకుందన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జెమినీ టీవీ ఛానల్ లో అక్టోబర్ 19న మధ్యాహ్నం 12 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కజల్ అగర్వాల్, శరాత్ కుమార్, మధుబాల, ముఖేష్ రిషి, శరత్‌కుమార్, బ్రహ్మానందం, రఘుబాబు, మధు, ఐశ్వర్య భాస్కరన్, సప్తగిరి, సంపత్, దేవరాజ్, శివ బాలాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర సంగీతాన్ని స్టీఫెన్ దేవాస్సీ మరియు మణి శర్మ స్వరపరిచారు. ఈ సినిమాను విష్ణు మంచు తన అవా ఎంటర్టైన్మెంట్ కింద మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు పై నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa