నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యంగ్ దర్శకుడు శ్రీకాంత్ ఓడెల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 26న పాన్ ప్రపంచ స్థాయిలో విడుదల కానుంది. సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa