'జైలర్ 2' సినిమా విడుదల తేదీపై సూపర్ స్టార్ రజినీకాంత్ క్లారిటీ ఇచ్చారు. జూన్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం కేరళలోని పాలక్కాడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. తదుపరి షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లేదా జనవరిలో షూటింగ్ పూర్తికానుంది. 'జైలర్' చిత్రంలోని రమ్యకృష్ణ, మిర్నా మీనన్, శివరాజ్ కుమార్ సీక్వెల్‌లోనూ కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa