రాజశేఖర్ తెరపై కనిపించి చాలా కాలమే అవుతుంది. కొత్తగా ఆయన ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు? అనే విషయం తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఓ తమిళ రీమేక్ ద్వారా ఆయన మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. తమిళంలో అటు థియేటర్స్ లో .. ఇటు ఓటీటీలోను ఆదరణ పొందిన ఆ సినిమా పేరే 'లబ్బర్ పందు' (రబ్బరు బంతి). ఈ సినిమా రీమేక్ తోనే రాజశేఖర్ బిజీగా ఉన్నాడని అంటున్నారు. ఓటీటీలో చాలామంది చూసేసిన ఈ సినిమా రీమేక్ ను ఆయన ఎంచుకోవడమే అభిమానులను ఆలోచనలో పడేసిన అంశం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa