పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రంలోని 'వీరా రాజ వీరా' పాటపై వచ్చిన కాపీరైట్ కేసులో ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్‌కు బుధవారం ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ భారీ ఊరటనిచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన రూ. 2 కోట్ల జరిమానా, క్రెడిట్స్ లో పేరు చేర్చాలన్న తీర్పును తోసిపుచ్చుతూ, పాట శివస్తుతి పాటను పోలి ఉందని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు తప్పు అని డివిజన్ బెంచ్ పేర్కొంది. దీంతో ఈ కేసులో రెహమాన్‌కు అనుకూలంగా తీర్పు వెలువడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa