ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మిరాయ్’ చిత్రంలో ‘వైబ్ అండీ’ పాట జతపరిచిన టీం

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 09:11 PM

‘మిరాయ్’ చిత్రబృందం, ప్రేక్షకుల నుంచి వచ్చిన డిమాండ్‌కు అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా విడుదలై చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘వైబ్ అండీ’ పాటను నేటి నుంచి థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో, ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు సైతం మళ్లీ థియేటర్లకు వచ్చే అవకాశం ఏర్పడింది.ప్రపంచవ్యాప్తంగా రూ. 134 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా, మౌత్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే, ప్రమోషన్ల సమయంలో యూట్యూబ్‌లో యువతను ఉర్రూతలూగించిన ‘వైబ్ అండీ’ పాట సినిమాలో లేకపోవడంపై చాలామంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిరాశ వ్యక్తం చేశారు. వేగంగా సాగే కథనానికి ఈ పాట అడ్డంకిగా మారుతుందనే ఉద్దేశంతో తొలగించినట్లు దర్శకుడు కార్తిక్ గతంలో వివరించారు.అయినప్పటికీ, ప్రేక్షకుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న చిత్ర నిర్మాణ సంస్థ, మనసు మార్చుకుంది. మంగళవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ‘మిరాయ్’ ఆడుతున్న అన్ని షోలలోనూ ఈ పాటను జతచేస్తున్నట్లు స్పష్టం చేసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa