ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డాన్ 3' లో ప్రముఖ కోలీవుడ్ నటుడు

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 08:35 AM

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన డాన్ మరియు డాన్ 2 బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచాయి. మూడవ విడతలో రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో విక్రాంత్ మస్సెయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కృతి సనాన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్‌ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో అర్జున్ దాస్ తన హిందీ అరంగేట్రం చేయడానికి చర్చలు జరుపుతున్నాడు. రానున్న రోజులలో ఈ విషయం పై క్లారిటీ రానుంది. ఈ చిత్రం జనవరి 2026లో సెట్స్ పైకి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa