శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించి విరాళాలు సేకరిస్తున్న సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. Global Hindu Heritage Foundation, savetemples.org వంటి పేర్లతో కొందరు వ్యక్తులు తిరుమల, తిరుపతి, తిరుచానూరు ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారని, విరాళాలు సేకరిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు.