Pakistan HS-1 Satellite: దాయాది దేశం అంతరిక్ష పరిశోధనలో కొత్త దశను చేరుకుంది. ఆదివారం, చైనా నేల పైనుంచి పాకిస్థాన్ తన తొలి హైపర్‌స్పెక్ట్రల్ ఉపగ్రహం HS-1ను జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం (JSLC) నుండి విజయవంతంగా ప్రయోగించింది.ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏమిటంటే... ఈ ప్రయోగం నిజంగా విజయవంతమా, లేక కేవలం ప్రదర్శన మాత్రమేనా అనేది. తాజా సమాచారం ప్రకారం, పాకిస్థాన్ ఈ ప్రయోగాన్ని తన దేశానికి సాంకేతికంగా పెద్ద ముందడుగు అంటూ వివరించింది.రూ.8.3 లక్షల కోట్ల ప్రాజెక్ట్ ఈ మిషన్, విజన్ 2047లో భాగంగా ఉంది. దీని వ్యయం సుమారు ₹8.3 లక్షల కోట్లు ఉండగా, పాకిస్థాన్ ఇది అమెరికా జాతీయ అంతరిక్ష విధానాల ఆధారంగా రూపొంది ఉంది అని పేర్కొంది. అయితే, కొందరు నిపుణులు దీన్ని “గూఢచారి ఉపగ్రహం”గా పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ HS-1 ఉపగ్రహం భూమి, అడవులు, నీరు, పట్టణ ప్రాంతాల చిన్న స్థాయి చిత్రాలను తీసే సామర్థ్యం కలిగి ఉంది. దీని అర్థం పర్యావరణ పర్యవేక్షణతో పాటు సరిహద్దులు, ప్రాజెక్టులపై కఠినమైన నిఘాను కూడా ఉంచగలదు. కాబట్టి ఇక్కడి ముఖ్య ప్రశ్న ఏమిటంటే, పాకిస్థాన్ తాజా ప్రయోగం సైన్సుకు ఆవశ్యకమైన పురోగతిగా ఉందా లేదా వ్యూహాత్మక గూఢచర్యా కార్యక్రమమా అన్నది.పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ప్రయోగాన్ని “అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక అడుగు”గా అభివర్ణించింది. అలాగే, పాకిస్థాన్-చైనా స్నేహ బంధాల లోతును ఇది ప్రతిబింబిస్తుందని పేర్కొంది. HS-1 ఉపగ్రహం పాకిస్థాన్-చైనా ఆర్థిక కారిడార్ (CPEC) మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో కీలకంగా ఉండబోతుంది. ఇది ఈ ఏడాది పాకిస్థాన్ విజయవంతంగా ప్రయోగించిన మూడో ఉపగ్రహం కాగా, EO-1 మరియు KS-1 మిషన్లు కూడా విజయవంతంగా నిర్వహించబడ్డాయి.ప్రయోగం సంబంధించి అన్ని సన్నాహాలు పాకిస్థాన్ శాస్త్రవేత్తల సమక్షంలో జరిగాయని, దాయాది అంతరిక్ష మరియు ఉన్నత వాతావరణ పరిశోధన కమిషన్ (సుపార్కో) వెల్లడించింది. కరాచీ సుపార్కో కాంప్లెక్స్ నుంచి ప్రయోగం ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరినట్లు, రాబోయే రెండు నెలలపాటు నిర్వహించబోయే పరీక్షల అనంతరం ఇది పూర్తి స్థాయిలో పనిచేస్తుందని సుపార్కో ప్రతినిధి పేర్కొన్నారు.సుపార్కో నివేదిక ప్రకారం, HS-1 ఉపగ్రహం భూమి, పంటలు, నీటి వనరులు, పట్టణ ప్రాంతాల వివరణాత్మక విశ్లేషణకు ఉపయోగపడనుంది. వందలాది స్పెక్ట్రల్ బ్యాండ్లలో ఖచ్చితమైన చిత్రాలు తీయగల దీని సామర్థ్యం వ్యవసాయ ప్రణాళిక, పర్యావరణ పర్యవేక్షణలో గొప్ప పాత్ర పోషిస్తుంది. చైనా-పాక్ ఆర్థిక కారిడార్ (CPEC) ప్రాజెక్టుల్లో ఏర్పడుతున్న సవాళ్లు, ముఖ్యంగా కొండచరియలు విరిగిపోవడం, కాలుష్యం, హిమానీనదాల కరగడం వంటి సమస్యలపై కూడా ఇది కీలక డేటాను అందించగలదు.
*ప్రయోగం వెనుక వాస్తవ ఉద్దేశం? పాకిస్థాన్ ఈ ప్రయోగాన్ని శాస్త్రీయ పురోగతిగా పేర్కొనగా, అనేక విశ్లేషకులు చైనా భూభాగం నుంచి తరచూ పాక్ ఉపగ్రహాలను ప్రయోగించడం రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సూచిస్తున్నదని భావిస్తున్నారు. రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఉపగ్రహాలను వ్యవసాయ, పర్యావరణ పర్యవేక్షణతో పాటు ప్రాంతీయ నిఘా, రహస్య సమాచార సేకరణ కోసం కూడా ఉపయోగించవచ్చని అంటున్నారు. నిజానికి, ఇది సైన్స్ అనే చల్లటి దుస్తుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్న వ్యూహాత్మక చర్యగా చూడవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa