తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఢిల్లీలో నిర్మిస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. దేశ రాజధానిలో టీడీపీ కార్యాలయం ఉండాలని పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సూచించారని అన్నారు. ఈ మేరకు కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాలా ఖట్టర్‌ను కలిశామని.. ఢిల్లీలో టీడీపీ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరామని చెప్పుకొచ్చారు. గతంలో టీడీపీ కార్యాలయం కోసం స్థల పరిశీలన జరిగిందని గుర్తుచేశారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa