ఏపీ బీజేపీ అధ్యక్ష అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఐదు సెట్ల నామినేషన్లపై సంతకాలు చేసి ఎన్నికల అధికారికి అందజేశారు. అధ్యక్ష పదవికి మాధవ్ పేరును ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. మరొకరు నామినేషన్ దాఖలు చేయకపోతే ఈయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన.. గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ఆర్ఎస్ఎస్, బీజేవైఎంలో బాధ్యతలు నిర్వర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa