☼ Suryaa News
🔴 జాతీయం ఆసియా కప్ విజేతలకు రాష్ట్రపతి అభినందనలు
జాతీయం

ఆసియా కప్ విజేతలకు రాష్ట్రపతి అభినందనలు

14 Sep 2026 vasu

న్యూఢిల్లీ:ఆసియా కప్‌లో టైటిళ్లు గెలుచుకుని సత్తా చాటిన భారత జూనియర్ పురుషుల, మహిళల హాకీ జట్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. యువ ఆటగాళ్ల అంకితభావం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి దేశానికి ఎంతో గర్వకారణమని ఆమె కొనియాడారు.

ఆదివారం చైనాలోని మోకిలో జరిగిన పురుషుల ఫైనల్లో భారత్ 4-1 తేడాతో కొరియాపై ఘనవిజయం సాధించి ఆసియా కప్ టైటిల్‌ను నిలబెట్టుకోగా, మహిళల ఫైనల్లో భారత జట్టు 1-0 తేడాతో చైనాను ఓడించి కప్‌ను ముద్దాడింది. ఈ విజయాలతో రెండు జట్లు జూనియర్ హాకీ ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయి. మన యువ క్రీడాకారులు తమ ప్రతిభతో భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని రాష్ట్రపతి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home