సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కొరియన్ పాప్, కొరియన్ డ్రామా సంస్కృతి ప్రేమికుల కోసం ప్రముఖ కొరియన్ ఫుడ్ దిగ్గజం నాంగ్‌షిమ్ సరికొత్త అనుభూతిని పరిచయం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన తమ ప్రసిద్ధ ఇన్‌స్టంట్ నూడుల్స్ బ్రాండ్ షిన్ రామన్‌ను భారత యువతకుమరింత చేరువ చేసేందుకు సంస్థ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం హైబ్ ఇండియా భాగస్వామ్యంతో దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక పాప్-అప్ పార్కుల్లో నాంగ్‌షిమ్ ప్రత్యేక అనుభవ వేదికలను ఏర్పాటు చేసింది.
భారతదేశంలోకే-పాప్, కొరియన్ జీవనశైలికి భారీగా ఆదరణ ఉన్న ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఈ హైబ్ పాప్-అప్ ఈవెంట్లు కొనసాగుతున్నాయి. ఈ వేదికలపై కొరియన్మ్యూజిక్, మర్చండైజ్ సంబరాలతో పాటు ఒరిజినల్ కొరియన్ స్పైసీ నూడుల్స్ రుచులను ఆస్వాదించేందుకు ప్రత్యక్ష రామన్ బార్లను ఏర్పాటు చేశారు. కే-పాప్ బ్యాండ్‌ల అభిమానులు తమఅభిమాన కొరియన్ సంస్కృతితో మమేకమవుతూ, కొరియాలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్-స్టైల్ రామన్ తయారీ విధానాన్ని స్వయంగా అనుభవించేలా ఈ ప్రత్యేక జోన్లనుతీర్చిదిద్దారు.
భారతీయమార్కెట్లో కొరియన్ ఆహార ఉత్పత్తులకు డిమాండ్ నిరంతరం పెరుగుతోందని, ముఖ్యంగా మిలీనియల్స్ మరియు జెన్-జీ యువత కొరియన్రుచులను అమితంగా ఇష్టపడుతున్నారని నాంగ్‌షిమ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ పాప్-అప్ఈవెంట్ల ద్వారా భారతీయ వినియోగదారులకు అసలైన కొరియన్ ఫుడ్ కల్చర్‌ను మరింత దగ్గరచేయడమే తమ ప్రధాన లక్ష్యమనిస్పష్టం చేశారు. లైవ్ రామన్ టేస్టింగ్ సెషన్లు, ఇంటరాక్టివ్ ఫోటో బూత్‌లు కే-వేవ్ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటూ సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి.