సూర్యఅంతర్జాతీయ డెస్క్: యెమన్‌లో ఉద్రిక్తతలు మళ్లీతారస్థాయికి చేరాయి. ఉత్తర యెమన్‌లోని అల్-జౌఫ్ ప్రావిన్స్‌లో టెలికమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలనులక్ష్యంగా చేసుకుని జరిగిన వైమానిక దాడుల్లో నలుగురు ఉద్యోగులు మరణించారని, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని హౌతీ వర్గాలు నిర్వహిస్తున్న అల్-మసీరా టీవీ వెల్లడించింది. సౌదీ అరేబియా సరిహద్దు వెంబడి ఉన్న కమ్యూనికేషన్ టవర్లపై సౌదీ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయని హౌతీ మీడియా పేర్కొంది.
యెమన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు మరియు అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వ మద్దతు దళాల మధ్య తీవ్రస్థాయి ఘర్షణలు కొనసాగుతున్న తరుణంలో ఈ వైమానిక దాడులుచోటుచేసుకున్నాయి. అల్-జౌఫ్, తైజ్, మారిబ్ ప్రావిన్స్‌లలో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు వరుసగా దాడులు నిర్వహిస్తున్నట్లు హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరియా తెలిపారు. అయితే తాజా వైమానిక దాడుల నివేదికలపై సౌదీ అరేబియా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
నైరుతియెమన్‌లోని కీలకమైన బాబ్ అల్-మందాబ్ జలసంధి పరిసరాల్లో పట్టు సాధించేందుకు హౌతీలు ప్రయత్నిస్తుండటంతో యుద్ధ వాతావరణం మరింత ముదిరింది. 2022లో కుదిరిన కాల్పులవిరమణ ఒప్పందం తర్వాత ఈ స్థాయిలో దాడులుజరగడం ఇదే మొదటిసారి అని రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు. టెలికాం వ్యవస్థలపై దాడుల వల్ల స్థానిక కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిణామాలు ఎర్ర సముద్ర తీరప్రాంతంలో మరోసారి తీవ్ర అస్థిరతకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.