☼ Suryaa News
🔴 సినిమా మంచి థియేట్రికల్ అనుభూతిని ఇస్తుంది.. ‘మహేంద్రగిరి వారాహి’పై హీరో సుమంత్ ధీమా!
సినిమా

మంచి థియేట్రికల్ అనుభూతిని ఇస్తుంది.. ‘మహేంద్రగిరి వారాహి’పై హీరో సుమంత్ ధీమా!

08 Sep 2026 Sravani

టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే హీరో సుమంత్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విశేషాలపై తాజాగా హీరో సుమంత్ మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సినిమా తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్ అని సుమంత్ తెలిపారు. హిందీ, తమిళ భాషల్లోనూ విడుదలవుతుండటంతో నార్త్ ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన వస్తోందని చెప్పారు. మూఢనమ్మకాలను ఎక్స్‌పోజ్ చేసే యూట్యూబర్ పాత్రలో తాను కనిపిస్తానని, వేదాలు, పురాణాలపై దర్శకుడు సంతోష్‌కు ఉన్న పట్టు ఈ కథకు ప్రధాన బలమని పేర్కొన్నారు. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ ఇస్తాయని, విజువల్ ఎఫెక్ట్స్ థియేటర్లలో సరికొత్త అనుభూతిని పంచుతాయని ధీమా వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ చేసిన సీరియస్ పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, ఆయనతో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని సుమంత్ వెల్లడించారు. ‘మురారి’ సినిమా ఛాయలు కనిపిస్తున్నప్పటికీ, కథాకథనాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని స్పష్టం చేశారు. అనూప్ రూబెన్స్ అందించిన నేపథ్య సంగీతం సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తుందని చెప్పారు. వారాహి అమ్మవారి సెంటిమెంట్ తమ సినిమాకు కూడా పాజిటివ్‌గా మారుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అన్ని   అంశాలతో పాటు పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న ఈ డివోషనల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Advertisement
సంబంధిత వార్తలు
సినిమా

సందీప్ కిషన్ సిగ్మా ట్రైలర్ విడుదల.. స్టైలిష్ యాక్షన్‌తో అదరగొట్టిన హీరో

🕑 18 Sep 2026
సినిమా

2027 ఆస్కార్స్ పోటీలో మరాఠీ చిత్రం ‘గొంధల్’

🕑 18 Sep 2026
సినిమా

ది ప్యారడైజ్ లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు.. బెంగళూరు ప్రెస్ మీట్‌లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు

🕑 18 Sep 2026
సినిమా

ప్రేమలు ఫేమ్ భావన స్టూడియోస్ నుంచి కొత్త సినిమా పిక్నిక్.. ఫస్ట్ లుక్ విడుదల మరియు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్

🕑 18 Sep 2026
సినిమా

జీ5లో ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఆక్టోపస్.. ఆకట్టుకునే రహస్యాల కథనం

🕑 18 Sep 2026
సినిమా

జైలర్ 2 సినిమాలో సూరజ్ వెంజరమూడు పవర్‌ఫుల్ రోల్.. రజినీకాంత్ చిత్రంలో కీలక పాత్ర రివీల్

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home