☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ యూపీఐ పై తప్పుడు ప్రచారాలను నమ్మకండి: కిలారు దిలీప్
ఆంధ్రప్రదేశ్

యూపీఐ పై తప్పుడు ప్రచారాలను నమ్మకండి: కిలారు దిలీప్

18 Sep 2026 Reporter
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అయిన యూపీఐపై ప్రతిపక్షాలు కేవలం కొన్ని రిస్కులను మాత్రమే హైలైట్ చేస్తూ, సాధారణ భారతీయులకు చేకూరుతున్న అపారమైన ప్రయోజనాలను విస్మరించి అపోహలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి అని ఆంధ్రప్రదేశ్ బిజెపి మీడియా ఇన్ఛార్జ్ కిలారు దిలీప్ ఆక్షేపించారుయూపీఐ అనేది భారతదేశంలోనే తయారైన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.  ప్రభుత్వం, ఆర్‌బీఐ (RBI), ఎన్‌పీసీఐలు దీనిని గుర్తించి, భద్రతను నిరంతరం పటిష్టం చేస్తున్నాయి అని ఇందుకోసం డివైజ్ బైండింగ్, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్, ట్రాన్సాక్షన్ లిమిట్స్, AI/ML ఆధారిత ఫ్రాడ్ మానిటరింగ్ మరియు రియల్-టైమ్ మోసాల గుర్తింపు వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి ఆర్థిక లావదేలను సులభతరం చేయడానికి ముందుకు తీసుకొచ్చాయని ఆయన తెలిపారు. నేరగాళ్లు టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని మొత్తం యూపీఐ వ్యవస్థనే విమర్శించడం సరికాదు అని రాజకీయ ప్రచారాలకు లోనుకాకుండ. యూపీఐ అందించిన ఆర్థిక కనెక్టివిటీ, సౌలభ్యం ఆధారంగానే దానిని అంచనా వేయండి అని ఆయన హితవు పలికారు. యూపీఐ అనేది రాజకీయాలు చేసే అంశం కాదు; ఇది మనం రక్షించుకోవాల్సిన, మరింత బలోపేతం చేయాల్సిన భారతీయ ఆవిష్కరణ. 
  • ఇది ప్రభుత్వ పన్ను కాదు: ఈ రుసుము ప్రభుత్వానికి వెళ్లదు. యూపీఐ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రతను నిర్వహించడానికి బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, యూపీఐ యాప్ సంస్థల మధ్య ఇది పంపిణీ అవుతుంది.
  • కస్టమర్లకు పూర్తిగా ఉచితం: కస్టమర్ (వినియోగదారుడు) ఈ ఎండీఆర్ చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిని కేవలం వ్యాపారి (మర్చంట్) మాత్రమే భరిస్తారు. ఈ భారాన్ని కస్టమర్లపై వేయవద్దని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అని పైగా ఇది వ్యక్తిగత బదిలీలు పూర్తిగా ఉచితం అని ప్రజలకు తెలియజేశారు.₹2,000 వరకు చేసే మర్చంట్ చెల్లింపులపై ఎలాంటి రుసుము ఉండదని తెలియజేస్తూ పైగా ప్రతిపక్షాలు దీనిని ఉద్దేశపూర్వకంగా "సామాన్యుడిపై పన్ను" అని ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవం అని ఆయన దుయ్యబట్టారు
  
Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

కన్నీటి కష్టాలకు 'ఏలూరి' భరోసా!కన్నీటి కష్టాలకు 'ఏలూరి' భరోసా!

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఉద్యోగాలు, పరిశ్రమల ద్వారా యువతకు బంగారు భవిష్యత్తు: మంత్రి ఎస్.సవిత

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

దొంగ దీక్షలు, ధర్నాలను ప్రజలు నమ్మరు* *వైసీపీ నాయకుల దీక్షలపై ఎమ్మెల్యే పరిటాల సునీత స్పందన* *వేపకుంటలో రూ.1.25కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం*

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

జనవరిలో తెనాలి వేదికగా నంది నాటకోత్సవాలు: మంత్రి కందుల దుర్గేష్

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

మండల పరిషత్ పాలక వర్గానికి సన్మానం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ఆపరేషన్ అవసరం లేకుండానే లివర్ క్యాన్సర్ కు అధునాతన చికిత్స

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home