
పేలిన "స్టెయిన్" గన్
నాగ్‌పూర్: అనాధికార ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో దక్షి ణాఫ్రికా అదరగొడుతుంది. ఇక్కడి విదర్భ స్టేడియంలో జరు గుతున్న తొలి టెస్ట్‌లో తొలి రెండు రోజులు బ్యాట్స్‌మెన్ సత్తా చా టితే, మూడో రోజు బౌలర్లు విజృంభించారు. దాంతో ప్రపంచ నెం బర్‌వన్ స్థానంలో ఉన్న టీమిండియా ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది. పేస్ బౌలర్ స్టెయిన్‘గన్’ (7/51) పేలడంతో భారత్ తొలి ఇన్నిం గ్స్‌లో కేవలం 233 పరుగులకే ఆలౌట్ అయింది. సెహ్వాగ్ (109 పరుగులు: 139 బంతుల్లో 15 ఫోర్లు) సెంచరీ సాధిస్తే, అరంగేట్రమ్ టెస్ట్ ఆడుతున్న బద్రినాథ్ (56) అర్ధసెంచరీతో రాణించాడు. తొలి ఇన్నిం గ్స్‌లో 325 పరుగులు వెనుకంజలో ఉన్న భారత్ ఫాలోఆన్ ఆడాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. మురళీవిజయ్ (27 బ్యాటింగ్), సచిన్ టెండూల్కర్ (15 బ్యాటింగ్)లు క్రీజు లో ఉన్నారు. భారత్ ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకో వాలంటే మరో 259 పరుగులు చేయాల్సివుంది. ఇంకా 8 వికెట్లు చేతిలో ఉన్నాయి.
గౌతీ, మాస్టర్ విఫలం ...
25/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ఆరంభిం చి న భారత్‌కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ త గిలింది. వరుసగా 11 అర్ధసెంచరీలతో ఫాంలో ఉన్న గంభీర్ (12) మోర్కెల్ బౌలింగ్‌లో బౌచర్‌కు క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విజయ్ (4) స్టెయిన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఐతే బంగ్లాదేశ్‌పై వరుసగ సెంచరీలు చేసి అద్భుత ఫాంలో ఉన్న సచిన్ కూడా నిరాశ పరిచాడు. స్టెయిన్ వేసిన ఆఫ్‌స్టంప్ లెన్త్ బంతిని సచిన్(7) సరిగ్గా ఆడలేక కీపర్ బౌచర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో భారత్ 56 పరుగులకే మూడు టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో డాషింగ్ బ్యా ట్స్‌మెన్ వీరేంద్రసెహ్వాగ్, కెరీర్ లో తొలి టెస్ట్ ఆడుతున్న బద్రినాథ్ సహాయంతో స్కోరు బో ర్డును ముందుకు నడిపించే బాధ్య తను తీసుకున్నాడు. అలాగే అర్ధసెం చరీ పూర్తి చేశాడు. లంచ్ వి రామం వరకు వికెట్ ప డకుండా జాగ్రత్తగా ఆ డటంతో భారత్ స్కోరు 119/3కి చేరింది. ఒకే ఒక్కడు...
లంచ్ విరామం తర్వాత సెహ్వాగ్ దక్షిణాఫ్రికా బౌల ర్లను ఓ ఆట ఆడించాడు. మైదానం అన్ని వైపుల వరుస బౌండరీలతో విరుచుకుపడి, వన్డే మ్యాచ్‌ను త లపించాడు. ఇక ఇన్నింగ్స్ 45వ ఓవర్‌లో కలిస్ వేసిన బంతిని పాయింట్ దిశలో తరలించి సెహ్వాగ్ శతకం పూ ర్తి చేసుకున్నాడు. కెరీర్‌లో సెహ్వాగ్‌కు ఇది 18వ సెంచరీ కావడం విశేషం.అనంతరం వరుసగా రెండు బౌండరీలతో అ దరగొట్టినప్పటికీ, పార్నెల్ వేసిన ఓ వైడ్ బంతిని అనవసరంగా ఆడి, ఫైగ్ లెగ్‌లో డుమినికి క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు. దాంతో సెహ్వాగ్-బద్రినాథ్‌లు 136 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యా నికి తెరపడింది. మ రోవైపు క్రీజులో నిలదొక్కుకున్న బద్రినాథ్, మోర్కెల్ బౌలింగ్‌లో అద్భుతమైన కవర్‌డ్రైవ్ కొట్టి తొలి టెస్ట్‌లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇక టీ విరామం (221/4) వరకు వికెట్ ఇ వ్వకుండా బద్రి, ధోనీలు ఆడారు.
12 పరుగులు...6 వికెట్లు!
భారత ఇన్నింగ్స్ గాడిలో పడుతున్న తరుణంలో సఫారీ పేస్ బౌలర్ స్టెయిన్ విజృంభించాడు. 221/4 స్కోరుతో చివరి సెషన్ ఆరంభించిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే పెద్దషాక్, కెప్టెన్ ధోనీ (6) స్పిన్నర్ హారిస్ బౌలింగ్‌లో కలిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే బద్రినాథ్ (56: 139 బంతుల్లో 7 ఫోర్లు) స్టెయిన్ బౌలింగ్‌లో మిడ్‌వికెట్ వద్ద ప్రిన్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి స్టెయిన్ హవా కొనసాగింది. ఆ వెంటనే ఈ మ్యాచ్‌లో అరంగేట్రమ్ చేసిన మరో భారత బ్యాట్‌మన్ సాహా అదే ఓవర్‌లో కేవలం 3 బంతులు మాత్రమే ఆడి పరుగులేమి చేయకుండా వెనుదిరిగాడు. అ నంతరం జహీర్ ఖాన్ (2), మిశ్రా (0), హర్భజన్ (8)లను వరు సగా స్టెయిన్ అవుట్ చేశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ 64.4 ఓవర్లలో 233 పరుగుల వద్దే ముగిసింది. చివరి 7.4 ఓవర్లలో భారత్ 12 పరుగులు చేసి ఆరు వికెట్లను కోల్పోయింది. టెస్ట్‌ల్లో స్టెయిన్ (7/51)కు ఇదే అత్యున్నత బౌలింగ్. 2007 సెంచూరి యన్ టెస్ట్‌లో కివీస్‌పై 6/49గా ఉండేది. ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయడం ఇది 13వసారి.ఓపెనర్ల నిష్ర్కమణ...
ఫాలో ఆన్‌కు 125 పరుగుల దూరంలో నిలిచిపోయిన భారత్ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఐతే రెండో ఓ వర్‌లోనే మోర్కెల్ ఓ అద్భుత బంతితో గంభీర్ (1)ను బౌల్డ్ చేశాడు. దాంతో వరుసగా 11 అర్ధసెంచరీలు చేసిన గం భీర్ రికార్డుకు ఈ మ్యాచ్‌తో బ్రేక్ పడింది. తొలి ఇన్నిం గ్స్‌లో సెంచరీతో అదరగొట్టిన సెహ్వాగ్ (16) మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ఆరంభించినప్పటికి, స్టెయిన్ బౌ లింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు. దాంతో 24/2తో మరోసారి భారత్ కష్టాల్లో పడింది. ఇక ఈ దశలో మురళీ విజయ్-సచిన్ మరో వికెట్ పడ కుండా చివరి వరకు జాగ్రత్తగా ఆడారు. మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 66 ప రుగులు చేసింది. విజయ్ (27: 68 బంతుల్లో 4 ఫోర్లు), సచిన్ (15: 48 బంతుల్లో 2 ఫోర్లు)లు క్రీజులో ఉన్నారు.స్కోరు బోర్డు
మొత్తం: 64.4 ఓవర్లలో 233 ఆలౌట్బౌలింగ్: స్టెయిన్ 16.4-6-51-7, మోర్కెల్ 15-4-58-1, హారిస్ 17-2-39-1, పార్నెల్ 7-1-31-1, కలిస్ 6-0-14-0, డుమిని 3-0-20-0.
భారత్ రెండు ఇన్నింగ్స్: గంభీర్ (బి) మోర్కెల్ 1, సెహ్వాగ్ (సి) స్మిత్ (బి) స్టెయిన్ 16, విజయ్ (బ్యాటింగ్) 27, సచిన్ (15), అదనం 7, మొత్తం: 23 ఓవర్లలో66/2
బౌలింగ్: స్టెయిన్ 4-0-14-1, మోర్కెల్ 6-2-21-1, పార్నెల్ 2-0-12-0, హారిస్ 7-3-12-0, కలిస్ 4-2-5-0
- ఐపీఎల్-4లో 74 మ్యాచ్‌లు
- వారిని డ్రెస్సింగ్ రూంలోకి కూడా రానివ్వను
- పదిహేనేళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టిన టింతు
- క్వార్టర్ ఫైనల్లో ఫెదరర్
- చర్యలు తీసుకోలేదు : పవార్
- ఐసీసీకి ఉప్పందించిన లంక కెప్టెన్
- ఐసీసీని రచ్చకీడుస్తాం
- యూఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో బోపన్న జోడి
- ఆర్చరీ ప్రపంచ కప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన భారత పురుషుల జ్ధాఒ
- సీడబ్ల్యూజీ ఏర్పాట్లపై సైనా అసంతృప్తి
- రికార్డు నెలకొల్పిన నవజిత్ కౌర్
- గో ఇండియా గో ఫర్ గోల్డ్ క్యాంపెయిన్ ఆరంభం
- క్రికెట్కది సదవకాశం: ద్రవిడ్
- స్పాట్ ఫిక్సింగ్ దోషుల్ని ఐసీసీ శిక్షించాలి
- మాస్టర్‌కు గ్రూప్ కెఫ్టెన్ హోదా
- కామన్వెల్త్ నుండి వైదొలిగిన స్టార్ అథ్లెట్లు
- వాహనాలకు సీడబ్ల్యూజీ వడ్డన
- ఆ ముగ్గురి నిష్ర్కమణ
- మూడో స్థానానికి పడిపోయిన సైనా
- లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్‌తో సియాగ్రామ్ ఫ్యూయల్ ఒప్పందం
- డోపింగ్‌లో దొరికిన భారత అథ్లెట్లు
- యూఎస్ ఓపెన్‌లో భూపతి జోడి ముందంజ


























































