Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Sports >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
భారత్‌కు మరో 21 స్వర్ణాలు !

Harishankar-Royఢాకా: 11వ దక్షిణాసియా క్రీడల్లో భారత్‌కు దూసుకుపోయింది. 11వ రోజు 21 స్వర్ణాలు, 13 రజతాలు, 7 క్యాంసాలతో మొత్తం 42 పతకాలు సాధించడం విశేషం. ఇప్పటి వరకు భారత్‌ 88 స్వర్ణాలు, 53 రజతాలు, 29 కాంస్యాలతో మొత్తం 170 పతకాలతో ఎవ్వరికి అందనంత అగ్రస్థానం లో కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌ 96 పతకాలు (18 స్వ, 23 ర, 54 కా), పాకిస్థాన్‌ 77 (18 స్వ, 25 ర, 34 కా)లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నా యి. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు దక్కాయి. పురుషుల హైజంప్‌ విభాగంలో జాతీయ చాంపియన్‌ హరిశంకర్‌రాయ్‌ 2.16 మీటర్ల ఎత్తు దూకి బంగారు పతకం సాధించగా, నిఖిల్‌ 2.13 మీటర్లతో రజతం గెలిచాడు. 100 మీటర్ల పురు షుల స్ప్రింట్‌లో శ్రీలంక రన్నర్‌ షహా న్‌ 10.46 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణం గెలవగా, భారత అథ్లెట్‌ అబ్దుల్‌ నజీబ్‌ (10.56 సె) రజతం తో సరిపెట్టుకున్నాడు. 4-400 రిలేలో భారత్‌కు చెందిన బిబిన్‌ మాథ్యూ, బిను, బినిష్‌, విబీలు 3:08.62 సెకన్లలో బంగారు పతకం గెలిచారు.

suranjo ఇక మహిళల 4-400 రిలేలోను భారత అథ్లెట్లు అశ్విని, థామస్‌ థినా, ప్రియాంక పవార్‌, జున్నా మున్నులు 3:38.62 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి పతకం గెలిచారు. మొత్తం ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో భారత్‌ 10 స్వర్ణాలతో శ్రీలంక (7 స్వ)లను వెనక్కి నెట్టడం విశేషం. ఇక టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల, మహిళల జట్టు విభాగాల్లో భారత క్రీడాకారులు ఫైనల్‌కు చేరారు. పురుషుల బాక్సింగ్‌లో అమన్‌దీప్‌ సింగ్‌ (48 కేజీలు), సురంజయ్‌సింగ్‌ ( 51 కేజీలు), చోటే లాల్‌ (57 కేజీలు)లు స్వర్ణాలు సాధించారు. భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టు 3-1 తేడాతో నేపాల్‌పై నెగ్గి స్వర్ణం సాధించింది. తైక్వాండోలో సందీప్‌ కుందు 87 కేజీల విభాగంలో బంగారు పతకం నెగ్గాడు. ఇక స్విమ్మింగ్‌లో మరో నాలుగు, వుషులో ఓ స్వర్ణం దక్కాయి.

Other News From Sports
SURYA Specials |
Weekly Specials |
Advertisement415
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us