Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Sports >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
‘శత ’ క్కొట్టిన‘ ఆమ్లా ’

aamlaనాగ్‌పూర్‌: ఇక్కడి విదర్భ స్టేడియంలో సఫారీ జట్టు అదరగొట్టింది. రెండో రోజు కూడా టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు. హషీం ఆమ్లా (253 నాటౌట్‌: 473 బంతుల్లో 22 ఫోర్లు) కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీ చేయగా, కలిస్‌ (173: 351 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టడంతో దక్షిణా ఫ్రికా భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 558/6 స్కోరు వద్ద సఫారీ కెప్టెన్‌ స్మిత్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేశాడు. భారత బౌలర్లలో జహీర్‌ ఖాన్‌ మూడు, హర్భజన్‌ సింగ్‌ రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ చేపట్టిన భారత్‌ రెండో రోజు ఆట ముగిసేసరికి నాలుగు ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. ఓపెనర్లు గౌతమ్‌ గంభీర్‌ (12), సెహ్వాగ్‌ (9)లు క్రీజులో ఉ న్నారు. భారత్‌ ఫాలోఆన్‌ ప్రమాదం నుంచి గట్టేక్కా లంటే మరో 334 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 10 వికెట్లు ఉన్నాయి.

ట్రిపుల్‌‌‌ సెంచరీ భాగస్వామ్యం...
291/2 ఓవర్‌నైట్‌ స్కోరు వద్ద ఆటను కొనసాగించిన కలిస్‌ (159), ఆమ్లా (115)లు ఆరంభం తొలి అరగంట కాస్తా తడబడ్డారు. ఇన్నింగ్స్‌ 96వ ఓవర్‌లో ఆమ్లా కొట్టిన బౌండరీతో దక్షిణాఫ్రికా స్కోరు 300కి చేరింది. ఆ తర్వాత కాసేపటికే జహీర్‌ బౌ లింగ్‌ ఆమ్లా లెగ్‌లో మరో బౌండరీ సంధించాడు. దాంతో కలిస్‌- ఆమ్లాలు 300 పరుగుల భాగస్వామ్యాన్ని అందుకున్నారు. అనం తరం ఇరువురు పోటీపడి బౌండరీలు కొట్టారు. ఐతే ఆమ్లా 148 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు రెండు సార్లు ఔట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

satha భజ్జీ బౌలింగ్‌లో షాట్‌ లెగ్‌లో విజయ్‌ సులభ క్యాచ్‌ను నేలపాలు చేయగా, ఆ తర్వాతి బంతికే కీపర్‌ ధోనీ కూడా ఓ కష్టసాధ్యమైన క్యాచ్‌ను అందుకోలేక పోయాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న ఆమ్లా 150 మైలురాయికి చేరుకు న్నాడు. ఇక చివరికి భజ్జీ బౌలింగ్‌లో కలిస్‌ (173) షాట్‌లెగ్‌లో విజయ్‌కి క్యాచ్‌ ఇచ్చి నిష్ర్కమించాడు. దాంతో 340 పరుగులు సుదీర్ఘ విరా మం తర్వాత భారత్‌కు మూడో వికెట్‌ దక్కింది.అనంతరం క్రీజులోకి వచ్చిన డివిలియర్స్‌తో కలిసి ఆమ్లా లంచ్‌ విరామం వరకు వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆ డాడు. అప్పటికి సఫారీ స్కోరు 379/3.

కెరీర్‌ తొలి డబుల్‌ సెంచరీ...
రెండో సెషల్‌లో ఎలాంటి భారీ షాట్లకు ప్రయత్నిం చకుండా, వీలు చిక్కినప్పుడు మాత్రమే బౌండరీలు కొడుతూ...ఎక్కువగా సింగిల్స్‌కే ప్రాధాన్యత ఇచ్చా రు. ఇన్నింగ్స్‌128.1 ఓవర్‌ వద్ద జట్టు స్కోరు 400కి చేరింది. ఆమ్లా డబుల్‌ సెంచరీకి చేరువ కావడంతో కాస్తా నెమ్మదించాడు. మరోవైపు డివిలియర్స్‌ టెస్ట్‌ల్లో 21వ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక ఆ మ్లా సెహ్వాగ్‌ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్స్‌లో బౌండరీ కొట్టి కెరీర్‌లో తొ లి సారిగా డబుల్‌ సెంచరీని సాధించాడు. ఐతే కాసేపటికి సెహ్వాగ్‌ వేసి న ఓ బంతిని సరిగ్గా ఆడలేక డివిలియర్స్‌ (53: 88 బంతుల్లో 5 ఫోర్లు) బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో బద్రినాథ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరి గాడు. నాలుగో వికెట్‌కు ఆమ్లా- డివిలియర్స్‌లు 108 పరుగులు జోడించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన డుమిని (9) టీ బ్రేక్‌ విరామానికి ముందు భజ్జీకి వికెట్ల ముం దు దొరికిపోయాడు. సఫారీ 477/5 వద్ద టీ విరామానికి వెళ్లింది.

558/6 డిక్లేర్డ్‌...
ఇక చివరి సెష న్‌లోనూ సఫా రీ పరుగు ల జోరు కొనసాగింది. మార్క్‌ బౌచర్‌- ఆమ్లాలు ఏ మాత్రం తడబాటు లేకుండా ఆడారు. ధోనీ రెండో బంతిని తీసుకున్నా ఫలితం దక్కలేదు. ఇదే జోరుతో ఆమ్లా 250 మైలురాయిని దాటాడు. ఇక చివరికి వేగంగా పరుగులు చేసే యత్నంలో బౌచర్‌ (39: 75 బంతుల్లో 3 ఫోర్లు) జహీర్‌ బౌలింగ్‌లో మి డ్‌వికెట్‌ వద్ద మిశ్రాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. రెం డోరోజు ఆటకు మరో నాలుగు ఓవర్లు మిగిలుండగా దక్షిణాఫ్రికా కెప్టెన్‌ స్మిత్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 176 ఓవర్లలో 558/6గా ఉంది. ఆమ్లా (253: 473 బంతుల్లో 22 ఫోర్లు), స్టెయిన్‌(0)లు క్రీజులో అజేయంగా నిలిచారు. భారత గడ్డపై దక్షిణాఫ్రికాకు ఇదే అత్యున్నత స్కోరు కావడం విశేషం. గతంలో 2008 చెనై్న టెస్ట్‌లో 540 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

స్కోరు బోర్డు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: స్మిత్‌ (బి) జహీర్‌ 6, ప్రిన్స్‌ (సి) ధోనీ (బి) జహీర్‌ 0, ఆమ్లా (నాటౌట్‌) 253, కలిస్‌ (సి) విజయ్‌ (బి) హర్భజన్‌ 173, డివిలియర్స్‌ (సి) బద్రినాథ్‌ (బి) సెహ్వాగ్‌ 53, డుమిని (ఎల్బీ-బి) హర్భజన్‌ 9, మార్క్‌ బౌచర్‌ (సి) మిశ్రా (బి) జహీర్‌ 39, స్టెయిన్‌ (నాటౌట్‌) 0, అదనం 25,
మొత్తం: 176 ఓవర్లలో 558/6

వికెట్ల పతనం: 1-5 (ఆమ్లా), 2-6 (స్మిత్‌), 3-346 (కలిస్‌), 4-454 (డివిలియర్స్‌), 5-476 (డుమిని), 6-554 (బౌచర్‌)

బౌలింగ్‌: జహీర్‌ఖాన్‌ 31-7-96-3, ఇషాంత్‌ 28-4-85-0, హర్భజన్‌ 46-1-166-2, అమిత్‌మిశ్రా 53-5-140-0, సెహ్వాగ్‌ 18-1-55-1
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: గంభీర్‌ (బ్యాటింగ్‌) 12, సెహ్వాగ్‌ (బ్యాటింగ్‌) 9, అదనం 4,
మొత్తం: 4 ఓవర్లలో 25/0
బౌలింగ్‌: స్టెయిన్‌ 2-0-8-0, మోర్కెల్‌ 2-0-13-0

tables

Other News From Sports
SURYA Specials |
Weekly Specials |
Advertisement467
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us