
ముస్లిం రిజర్వేషన్లు చెల్లవు
హైదరాబాద్, మేజర్ న్యూస్: ముస్లింలకు విద్యా రంగంలో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు చెల్లుబాటు కావని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సోమవారం ఉదయం ఏడుగురు న్యాయమూర్తు లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై తుది తీర్పు ఇచ్చింది. ఈ ధర్మాసనంలో ఐదుగురు జీవో లకు వ్యతిరేకంగా, ఇద్దరు అనుకూలంగా తీర్పు చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లపై ప్రభుత్వానికి ఇలా వరుసగా మూడవ సారి ఎదురుదెబ్బ తగిలింది. 2004లో ఒకసారి, 2005లో జారీ అయిన మరో చట్టాన్ని హైకోర్టు కొట్టి వేసింది. విశ్వహిందూపరిషత్ సీనియర్ నేత టి.మురళీ ధర్ రెడ్డి ఈ మూడు సార్లూ పిటిషన్ దాఖలు చేసి విజయం సాధించటం విశేషం. రిజర్వేషన్లకు అనుకూలంగా న్యాయ వాది కె.కొండలరావు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి ఎ.ఆర్. దవెతో పాటు జస్టిస్ టి.మణికుమారి, జస్టిస్ జె.రఘు రామ్, జస్టిస్ ఎ.గోపాల్ రెడ్డి, జస్టిస్ వి.ఈశ్వరయ్య , జస్టిస్ డీఎస్ వర్మ, జస్టిస్ ప్రకాశరావు ఉన్నారు. చివరి ఇద్దరూ ప్రభుత్వ ఆదేశాలను సమర్థించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీ 2007 జూలై 24న చట్టాన్ని ఆమోదించింది. దీనికి వ్యతిరేకంగా, అనుకూలంగా పలు పిటిషన్లుదాఖలయ్యాయి.
రాజ్యాంగ విరుద్ధం : దవె
ధర్మాసనానికి నాయకత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి ఎ.ఆర్.దవె ధర్మాసనం తరఫున తీర్పును చదివారు. వెనుకబడిన తరగతుల కమిషన్ రిజర్వేషన్లపై పరిశీలించి ఇచ్చిన సిఫారసులు హేతు బద్ధంగా లేవని, ఇలా రిజర్వేషన్లు కల్పించటం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. అందువల్ల ప్రభుత్వం జారీ చేసిన 230 జీవో, 231 జీవోలను కొట్టి వేస్తున్నామని ప్రధాన న్యాయ మూర్తి ప్రకటించారు. వెనుకబడిన తరగతుల కమిషన్ పరిశీలనాంశాలు వాస్తవ పరిస్థితికి అద్దం పట్టలేదన్నారు.
చట్టం చెల్లదు : మణికుమారి
వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేయటానికి, సిఫారసులను చట్టం రూపంలో తీసుకురావటానికి ప్రభు త్వానికి పూర్తి అధికారం ఉందని జస్టిస్ మణికుమారి వ్యాఖానించారు. అయితే కమిషన్ నివేదిక అసమగ్రంగా ఉందని, ఎలాంటి శాస్ర్తీయత లేకుండా, సర్వే జరపకుండా తయారు చేశారన్నారు. కేవలం ఆరు జిల్లాల్లోనే సర్వే జరిపారని, దానితో పాటు ఇందిరా సాహ్ని కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా లేదని తీర్పులో పేర్కొన్నారు.
పక్కన ఉంచే వీల్లేదు : డిఎస్ వర్మ
జస్టిస్ డిఎస్ వర్మ తన తీర్పులో ఐదుగురు న్యాయ మూర్తులు ఇచ్చిన తీర్పును అంగీకరించటం లేదని స్పష్టం చేశారు. జస్టిస్ దవె ధర్మాసనం తరఫున తన తీర్పు వెలువ రించారు. వెనుకబడిన తరగతుల కమిషన్ హడావుడిగా సిఫారసులు చేసిన మాట నిజమే అయినా దాన్ని పక్కన ఉంచటానికి వీల్లేదని మరో న్యాయమూర్తి ప్రకాశరావు తన తీర్పులో తెలిపారు. కమిషన్ మళ్ళీ సర్వే జరిపించవచ్చు నని, ఆ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించవచ్చని జస్టిస్ ప్రకాశరావు తెలిపారు.
15 కులాలకు నష్టం
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా సామా జికంగా, విద్యాపరంగా వెనుకబడిన ముస్లింలలో 15 కులాలను వెనుకబడిన తరగతుల రిజర్వేషన్‌కు అర్హులుగా చేస్తూ 2007లో ముస్లిం చట్టాన్ని అమలు చేస్తున్నట్టు ప్రక టించారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ తీర్పు ముస్లిం వర్గాలకు తీరని నిరుత్సాహం కలిగించటంతో పాటు రిజర్వేషన్ సౌకర్యం అనుభవిస్తున్న వేలాది మంది విద్యార్థులకు నష్టం కలిగించనున్నది. అందులోనూ 2007 నుంచి మెడిసిన్, ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువు కుంటున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. ఇదే రిజర్వేషన్ కోటా కింద నియామకమైన ఉద్యోగులకూ నష్టం కలిగించే అవకాశాలున్నాయి.
అడ్వకేట్ జనరల్ వినతికి నో
కోర్టు తీర్పు తర్వాత అడ్వకేట్ జనరల్ సీతారామమూర్తి జోక్యం చేసుకుంటూ తీర్పు అమలును మూడు మాసాలు సస్పెండ్ చేయాలని చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపు చ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పును అందు కున్న 90 రోజుల్లో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి దవె అవకాశం ఇచ్చారు.
సుప్రీంకు వెళతాం ః సీఎం
హైదారబాద్, మేజర్‌న్యూస్: ముస్లింలను బీసీల్లో చేర్చుతూ వారికి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు కొట్టి వేయడంపై సుప్రీంకోర్టుకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించారు. వెనకబడిన ముస్లింలకు రిజ ర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఈ సంద ర్భంగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. అంతకు ముందు హైకోర్టు తీర్పుపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. తీర్పు వెలువడే సమయానికి మంత్రులతో సమావేశమై ఉన్న రోశయ్య ఈ అంశంపై కూడావిస్తృతంగా చర్చించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసి స్టే ఉత్వర్వులు పొందటంతో పాటు బీసీ కమిషన్ నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించేలా చర్యలు తీసుకోవాలని ిసీఎం ఆదేశించినట్లు సమాచారం. హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వాటికి తగిన వివరణతో కూడిన పిటీషన్ దాఖలు చేస్తే బాగుంటుందని మంత్రులు అభిప్రాయపడ్డట్టు సమాచారం.
వాస్తవ పరిస్థితులకు భిన్నంగా బీసీ కమిషన్ నివేదికలు ఉన్నాయని, కేవలం ఆరు జిల్లాల్లో మాత్రమే సర్వే జరిగినట్లు హైకోర్టు పేర్కొనడంపై మంత్రుల మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తుందని సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి గీతారెడ్డి ప్రకటించారు. హైకోర్టు తీర్పుపై సీఎం సమీక్షించారని తెలిపారు. గతంలో రెండు సార్లు ఈ అంశంపై సర్కారుకు వ్యతిరేకంగా తీర్పులు వెలువడినా ప్రభుత్వం సక్రమంగా నివేదికలు ఇవ్వడంలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరో వైపు హైకోర్టు తీర్పుతో అధికార పార్టీలో కలకలం చెలరేగింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయంలో కూడా ఈ అంశంపై కోర్టు తీర్పులు వెలువడిన అనంతరం కూడా అధికార యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియపై తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని అధికార పార్టీ నాయకులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ కూడా సర్కారు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సర్కారు తీరును ఎండగడుతూ ఆ పార్టీ శాసన సభ్యులు తమ కార్యకర్తలతో సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సీనియర్‌లు కూడా హైకోర్టు తీర్పుపై తీవ్రంగా స్పందించారు. ఎన్నికలలో ముస్లింల ఓట్లు పొంది ఆ తరువాత రిజర్వేషన్లు వంటి కీలకమైన అంశాలపై ప్రభుత్వం మెతక వైఖరి అవలంభించడంపట్ల పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మైనార్టీల అభివృద్ధికి పకడ్బందీ చర్యలు మనీష్ తినారీ
న్యూఢిల్లీ : మైనార్టీ లను జాతీయ అభి వృద్ధి స్రవంతిలోకి తెచ్చేందుకు పక డ్బందీ చర్యలు తీసు కోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధి కార ప్రతినిధి మనీష్‌తివారీ విలేకరులకు వివరించారు. ముస్టింలకు ఉద్యోగాల రిజ ర్వేషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరిం చడం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వీరికి 10శాతం రిజర్వేషన్ కేటాయించడంపై నిర్దిష్టమైన నిర్ణయాన్ని తీసుకుంటామని పేర్కొన్నారు. మైనార్టీల జాతీయ అభివృద్ధి స్రవంతిలోకి తీసుకు వచ్చే విధంగా చ్చి తమైన చర్యలు చేపడతామని ఆయన వివ రించారు. ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు పశ్చిమబెంగాల్ ప్రభుత్వ నిర్ణయం స్వాగతించదగినదే అయినా ప్రస్తు తం నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. మైనారిటీ రిజర్వేషన్ విషయంలో వివిధ ప్రాంతాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ఈ విషయంలో బ్లాక్ అండ్ వైట్‌గా వ్యవ హరించకూడదన్నారు. రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా మైనారిటీ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ నివేదిక ప్రభుత్వం దగ్గరే ఉందన్నారు.
- బీసీల ఫీజులకు అంటకత్తెర
- మంత్రి బాలినేని ఔట్ ?
- విచారణ వేళ... హుష్... ఫైళ్లు !
- కేడర్‌కు సినీ టానిక్ !
- యోధుడా ? క్రోధుడా ?
- ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు
- ఆ ప్యాలెస్ ఎక్కడిది?
- అన్ని కోట్లు ఎలా వచ్చాయి ?
- చర్యలు ఉండవు
- విలీనం కాదు... విమోచనమే...
- దొంగ అడ్మిషన్లు ఇస్తే జైలు
- మహిళలు విద్యావంతులైతే దేశ ప్రగతి
- అరవిందరావు నియామకంపై ‘క్యాట్’ ను ఆశ్రయించిన గౌతం కుమార్
- రోశయ్య వల్ల కానే కాదు
- రెండు కేంద్రాల్లో మళ్ళీ గ్రూప్ -1 పరీక్ష ?
- కాంగ్రెస్‌ది అనారోగ్య పాలన
- రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి
- డిసెంబర్ 31 తర్వాత యుద్ధమే
- ప్రముఖుల ఆస్తులపై విచారణ జరగాలి
- కాంగ్రెస్‌లో టీడీపీ కోవర్టులు
- ఎన్ఎఓబీ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించండి
- బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత
- వరంగల్ పోలీసుల అదుపులో... అయిదుగురు రైతుకూలీ సంఘం నేతలు
- అగ్ని మాపక శాఖలో నగదు పురస్కారాలు
- ఎపీఐడిసీ డైరెక్టర్‌గా జేసీ శర్మ
- పలువురు ఐఎఎస్‌ల బదిలీలు
- లగడపాటిపై కేసు !
- సత్యం కేసు విచారణ పూర్తి
- పవర్ ప్రాజెక్టులకు భూసేకరణపై సీఎస్ సమీక్ష
- ప్రజాస్పందనే మా నివేదిక
- పోరాటం ఆగదుః చంద్రబాబు
- కొత్త మార్గదర్శకాలు జారీ
- ముసురుకుంటున్న వ్యాధులు
- హైనా దాడి: 50 మంది తీవ్ర గాయాలు
- కొనసాగుతున్న వరద భీభత్సం
- సినిమాల్లోకి చిరు రీ ఎంట్రీ
- రోడ్డు పనులపై పొన్నాల ఆగ్రహం
- ఆర్టీసీ ఎన్నికలు నేడే
- శ్రీ పద్దతిలో వరి సాగు మెట్ట ప్రాంత రైతులకు లాభదాయకం
- మన్న"వరం"... భూ వివాదాలు
- యడ్యూరప్ప కుమార్తెకు సాక్షరతా అవార్డు
- ఐటీడీఏపై ప్రభుత్వ ఉదాసీనత
- ఎరువుల పంపీణీలోనూ వివక్షేనా ?
- ప్రభుత్వం స్పందించాలి : యుటిఎఫ్
- పారామెడికల్ నోటిఫికేషన్ విడుదల
- సచివాలయానికి సీఎం...
- బాబు మాటలు ప్రజలు నమ్మరు
- నిపుణుల బృందం రిటైనింగ్ వాల్ పరిశీలన
- బెదిరింపులు సరికాదు : సోమిరెడ్డి


























































