
మందకృష్ణపై.. విద్యార్థి ‘కేక’
వరంగల్, మేజర్‌న్యూస్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన తెలంగాణ విద్యార్థి పొలికేక బహిరంగసభ రసాభాసాగా మారింది. తెలంగాణ సాధించాలనే తపనతో గత 21 రోజులుగా తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలను చుట్టి వచ్చిన తెలంగాణ విద్యార్థుల పాదయాత్ర ముగింపు సమావేశం ఆదివారం కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా ఆర్యప్రతినిధి సభ అధ్యక్షుడు స్వామి అగ్నివేశ్‌తోపాటు తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితరులు హాజరయ్యారు.
సభలో తెలంగాణ రచయిత, గాయకుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడిన అనంతరం ఎమ్మార్పీయస్ వ్యవస్థాపక అధ్యక్షుడు జేఏసీ నాయకుడు మందకృష్ణ మాదిగను మాట్లాడాలని జేఏసీ నేతలు ఆహ్వానించారు. ఈ దశలో మందకృష్ణ మాట్లా డడం ప్రారంభించగానే సభలో కూర్చున్న విద్యార్థులు ఒక్కసారిగా వాటర్ ప్యాకెట్లను మందకృష్ణమాదిగపై విసిరేస్తూ అడ్డుతగిలారు. మందకృష్ణ ప్రసం గాన్ని అడుగడుగునా అడ్డుకుంటూ సభకు ఆటంకం కల్పించారు. ఈ దశలో మందకృష్ణ మాదిగ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే తీవ్ర స్వరంతో ఇది కుట్ర పూరితంతో కూడిన దాడి అన్నారు. తెలంగాణలో 50 శాతంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు న్యాయమైన వాటా అందడంలేదని, ఇది అగ్రవర్ణాల కుట్ర అని మందకృష్ణ అభిప్రాయపడ్డారు. దొరల తెలంగాణ కాదని, సామాజిక తెలం గాణ కావాలని అన్నారు. అగ్రవర్ణ పెత్తందార్ల చేతుల్లో తెలంగాణ ఉద్యమం కొనసాగు తోందని మందకృష్ణ విమర్శించారు.
ఈ నేపథ్యంలో సభలో కొం దరు లేచి మందకృష్ణ మాట్లాడొద్దని దేశపతి పాట పాడాలని విద్యార్థులు నిన దించారు. అయినా మందకృష్ణ ప్రసంగాన్ని కొనసాగిస్తుండడంతో ఆగ్రహిం చిన విద్యార్థులు కుర్చీలు, వాటర్ ప్యాకెట్లు విసిరేస్తూ ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. తెలంగాణ ఉద్యమం విద్యార్థులు చేస్తున్న ఉద్యమమేనని, దీన్ని కొంత మంది రాజకీయ శక్తులు అక్రమ మార్గాలకు పురిగొల్పుతున్నాయని మందకృష్ణ విమర్శించారు. సామాజిక తెలంగాణ సాధించేవరకు ఈ ఉద్యమం కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణ సాధించిన తర్వాత రాష్ట్రాన్ని ఏలుకునేది బడుగు బలహీన వర్గాలే అని ఆయన అన్నారు. ఆయన మాట్లాడుతుండగానే దేశపతిపై కొంతమంది అతనిపై చేయిచేసుకొని కొట్టారు. దీంతో దేశపతి చొక్కా పూర్తిగా చినిగిపోయి, చేయికి గాయమైంది. ముఖ్యఅతిథి విచ్చేసిన స్వామి అగ్ని కేష్ ఈ సమావేశంలో ప్రసగించకుండానే వేదికపై నుండి దిగి వెళ్ళిపోయారు.
కేసీఆర్ నాపై దాడి చేయించారు : మందకృష్ణ
పొలికేక సభలో తాను మాట్లాడకుండా టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ నాపై దాడి చేయించారని మందకృష్ణమాదిగ ఆరోపించారు. సభ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాజిక తెలంగాణ విషయమై తాను మాట్లాడుతుంటే కొందరు అడ్డుకున్నారని, దీని వెనుకాల కెసిఆర్ కుట్ర దాగి ఉందని విమర్శించారు. ఒక దశలో విద్యార్థి ఉద్యమం పక్కదారి పట్టే విధంగా కొంతమందినాయకులు చేసిన ప్రయత్నం వల్లనే తెలంగాణ విద్యార్థి పొలికేక రసాభసాగా మారిందని పలువురు వ్యాఖ్యానించారు.
- బీసీల ఫీజులకు అంటకత్తెర
- మంత్రి బాలినేని ఔట్ ?
- విచారణ వేళ... హుష్... ఫైళ్లు !
- కేడర్‌కు సినీ టానిక్ !
- యోధుడా ? క్రోధుడా ?
- ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు
- ఆ ప్యాలెస్ ఎక్కడిది?
- అన్ని కోట్లు ఎలా వచ్చాయి ?
- చర్యలు ఉండవు
- విలీనం కాదు... విమోచనమే...
- దొంగ అడ్మిషన్లు ఇస్తే జైలు
- మహిళలు విద్యావంతులైతే దేశ ప్రగతి
- అరవిందరావు నియామకంపై ‘క్యాట్’ ను ఆశ్రయించిన గౌతం కుమార్
- రోశయ్య వల్ల కానే కాదు
- రెండు కేంద్రాల్లో మళ్ళీ గ్రూప్ -1 పరీక్ష ?
- కాంగ్రెస్‌ది అనారోగ్య పాలన
- రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి
- డిసెంబర్ 31 తర్వాత యుద్ధమే
- ప్రముఖుల ఆస్తులపై విచారణ జరగాలి
- కాంగ్రెస్‌లో టీడీపీ కోవర్టులు
- ఎన్ఎఓబీ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించండి
- బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత
- వరంగల్ పోలీసుల అదుపులో... అయిదుగురు రైతుకూలీ సంఘం నేతలు
- అగ్ని మాపక శాఖలో నగదు పురస్కారాలు
- ఎపీఐడిసీ డైరెక్టర్‌గా జేసీ శర్మ
- పలువురు ఐఎఎస్‌ల బదిలీలు
- లగడపాటిపై కేసు !
- సత్యం కేసు విచారణ పూర్తి
- పవర్ ప్రాజెక్టులకు భూసేకరణపై సీఎస్ సమీక్ష
- ప్రజాస్పందనే మా నివేదిక
- పోరాటం ఆగదుః చంద్రబాబు
- కొత్త మార్గదర్శకాలు జారీ
- ముసురుకుంటున్న వ్యాధులు
- హైనా దాడి: 50 మంది తీవ్ర గాయాలు
- కొనసాగుతున్న వరద భీభత్సం
- సినిమాల్లోకి చిరు రీ ఎంట్రీ
- రోడ్డు పనులపై పొన్నాల ఆగ్రహం
- ఆర్టీసీ ఎన్నికలు నేడే
- శ్రీ పద్దతిలో వరి సాగు మెట్ట ప్రాంత రైతులకు లాభదాయకం
- మన్న"వరం"... భూ వివాదాలు
- యడ్యూరప్ప కుమార్తెకు సాక్షరతా అవార్డు
- ఐటీడీఏపై ప్రభుత్వ ఉదాసీనత
- ఎరువుల పంపీణీలోనూ వివక్షేనా ?
- ప్రభుత్వం స్పందించాలి : యుటిఎఫ్
- పారామెడికల్ నోటిఫికేషన్ విడుదల
- సచివాలయానికి సీఎం...
- బాబు మాటలు ప్రజలు నమ్మరు
- నిపుణుల బృందం రిటైనింగ్ వాల్ పరిశీలన
- బెదిరింపులు సరికాదు : సోమిరెడ్డి


























































