
Home >> State News >> News
మొయలీ మాకొద్దు
కాంగ్రెస్ అధిష్ఠానాన్ని సమస్యల మీద సమస్యలు చుట్టుముడుతున్నారుు. ఒక దాన్ని పరిష్కరించామనుకుంటే మరొకటి. ఒక సమస్య చక్కదిద్దామనుకుంటే దాని వెంటే మరో సమస్య. రాష్ర్టంలో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయంకోసం కమిటీ వేస్తే.. దాని మీదనే సమన్వయం లేకుండా పోరుుంది. తెలంగాణ నాయకుడిేక దాని పగ్గాలు అప్పగిం ాలని తెలంగాణ కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా అందరూ ఒేక గళం వినిపించడం విశేషం. హైదరాబాద్‌లో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితర నేతలు సమావేశమై ఆ మేరకు తీర్మానించారు. హస్తినలో మరికొందరు ఎంపీలు సమన్వయ కమిటీ కూర్పుపై పెదవి విరిచారు. తెలంగాణ ఎంపీలకు చోటు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
హైదరాబాద్, మేజర్ న్యూస్: కాంగ్రెస్ పార్టీలో ధిక్కార స్వరం మళ్లీ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం కోసం పార్టీ హైకమాండ్ ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ కమిటి కూర్పుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఈ విషయంలో పార్టీ అధినాయకత్వం నిర్ణయంపై ధిక్కారస్వరం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఆనవాయితీ ప్రకారం ఈ కమిటీకి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డీ.శ్రీనివాస్‌నే ఛైర్మన్ చేయాలని డిమాండ్ చేశారు. శనివారం రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కె.కేశవరావు నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేె.కేశవరావుతోపాటు మంత్రులు డీ.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీ.సుధర్శన్‌రెడ్డి, డీకే. అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ఎంపీలు జీ.వివేక్, మాజీ మంత్రులు కే.జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సారయ్య, సీ.ముత్యంరెడ్డి, పీ.క్రిష్ణారెడ్డి, సోమారావు సత్యనారాయణరావు, ప్రతాప్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సీ.లింగయ్య, భిక్షపతిగౌడ్, టీ.రాజయ్య, సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, ఎమ్మెల్సీలు బీ.మోహన్‌రెడ్డి, భాను ప్రసాద్, యాదవ్‌రెడ్డి, ఇంద్రసేన్‌రెడ్డి, భారతీ రాగ్యనాయక్, కేఆర్.ఆమోస్, రాజలింగం, ప్రేంసాగర్, వీ.భూపాల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. పార్టీ అధిష్ఠానం ప్రకటించిన కోఆర్డినేషన్ కమిటీిపై సమావేశంలో నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం.ఆనవాయితీ ప్రకారం ఈ కమిటీికి పీసీసీ అధ్యక్షుడు ఛైర్మన్‌గా, సీఎం డిప్యూటీ ఛైర్మన్‌గా ఉండాలని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తెలంగాణకు చెందిన డి.శ్రీనివాస్‌ను ఛైర్మన్‌గా చేయకుండా కమిటీి కన్వీనర్‌గా చేయడం ముమ్మాటికి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లేనని ఈ సమావేశం భావించినట్లు తెలిసింది. ఈ అన్యాయంపై అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిందేనని నిశ్చయించారు. ఆనవాయితీ ప్రకారం డీఎస్‌నే ఈ కమిటికి ఛైర్మన్ చేయాలని అధిష్ఠానాన్ని కోరుతూ తీర్మానంచేశారు. ఈ తీర్మానాన్ని హైకమాండ్‌కు పంపాలని నిశ్చయించారు. ఒకవైపు తెలంగాణ ఉద్యమం సాగుతుంటే అదేమీ పట్టనట్లుగా కాంగ్రెస్ అధినాయకత్వం ఈ కమిటీని హడావుడిగా ప్రకటించడమే కాకుండా తమ ప్రాంతం పట్ల వివక్షను ప్రదర్శించిందని వారు చర్చించుకున్నారు.
ఈ వైఖరిని తాము కచ్చితంగా ఖండించి తీరాలని, అంతేకాకుండా జరిగిన అన్యాయం సరిదిద్దేలా పోరాడాలని నిశ్చయించారు. అదే సందర్భంలో ముఖ్యమంత్రి కె.రోశయ్య తీరుపై కూడా ఈ సమావేశంలో మెజార్టీ సభ్యులు అసహనం ప్రదర్శించినట్లు తెలిసింది. తాను సమైక్యవాదినని ఢిల్లీలో రోశయ్య చెప్పిన వ్యాఖ్యలపై తొలుత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సమావేశంలో ప్రస్తావిస్తూ నిప్పులు చెరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాలను ఒకేలా చూడాల్సిన ఆయన ఈ రకమైన వ్యాఖ్యనాలను చేయడం సరికాదని ఆయన చెప్పారు. ఆయన చూపంతా సీమాంధ్రవైపే ఉందని ఆయన పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి సీఎంగా ఉంటే తెలంగాణకు ఏం న్యాయం జరు గుతుందని చెప్పినట్లు తెలిసింది.
రోశయ్య అధికారపగ్గాలు చేపట్టాక బదిలీలు, నియామకాలు, కేటాయింపులలో తెలంగాణపై జరుగు తున్న అన్యాయాన్ని అడ్డుకోకపోగా తనకేమీ తెలియదన్నట్లు ఆయన వ్యవహ రిస్తున్నారని ఆయన ధ్వజమెత్తినట్లు సమాచారం. ఈ అభిప్రాయంతో సమావేశంలోని మెజార్టీ సభ్యు లు ఏకీభవించినట్లు తెలిసింది. దామోదర్‌రెడ్డి వ్యాఖ్యనాలను సమర్థించినట్లు సమాచారం. నిధులు, ఉద్యోగాలు, నియమకాలు, ప్రయోషన్లలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకు వీలుగా సీఎంతోపాటు తెలంగాణకు చెందిన మంత్రులతో ఒక పర్యవేక్షణ కమిటీ వేయాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరాలని నిర్ణయించినట్లు సమాచారం. రోశయ్య తీరును పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని కూడా వీరు యోచించినట్లు తెలిసింది. కెవిపిపై టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన విమర్శలపై విచారణకు అందరం కలసి ఒత్తిడి తీసుకొద్దామని కాంగ్రెస్ సీనియర్‌నేత, ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్ సమావేశంలో అన్నారు.
దీనిని కె.కేశవరావుతోపాటు, జానారెడ్డి వారించినట్లు తెలిసింది. ఈ రకమైన చర్యల వల్ల కాంగ్రెస్‌పార్టీ ప్రతిష్ట దెబ్బ తింటుందని చెప్పారు. ఈ విషయం చేపడితే తెలంగాణ అంశం పక్క దారిపడుతుందని కూడా పేర్కొన్నారు. దీనిపై ఆమోస్ కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలంగాణపై కేంద్రం ప్రకటించిన కమిటీపై కూడా ఈ సమావేశంలో సుధీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. తాము పార్టీ అధిష్ఠానంపై ఎంతో ఒత్తిడి తీసుకొచ్చి ఈ కమిటీని వేయించామని కె.కేశవరావు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగానే వస్తుందని చెప్పారు. ఒకవేళ మరోలా వచ్చినా వాటికి తామంతా కట్టుబడి ఉందామని కేశవరావు సూచించినట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా జేఏసీలో అనధికారికంగా కొనసాగకూడదని నిశ్చయించారు. తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే కాబట్టి కాంగ్రెస్ తరపున సొంతంగా జేఏసీని ఏర్పాటుచేసుకుని ముందుకెళ్లాలని ఈ సమావేశంలో తీర్మానించారు.
More From State News
- అందరి చూపు డిసెంబర్ వైపే
- ‘ఓదార్పు’ లో ‘ధిక్కారం’
- ‘పరీక్ష’ పాస్
- ఒత్తిళ్లకు నో
- పోటెత్తిన వరద
- ఫీజు రీయంబర్స్మెంట్పై ‘దేశం’ బడుగుబాట
- కాంగ్రెస్ సక్సెస్
- పత్తాలేని టీడీపీ
- ముఖం చాటేసిన కేసీఆర్
- మీరు మంత్రులా... అటెండర్లా...
- కొత్త గ్యాస్ ఏజెన్సీలకు అడ్డుపుల్లలు
- విశాఖలో ప్రశాంతంగా గ్రూప్ -1
- వాయిదా పడిన పీసెట్ కౌన్సిలింగ్
- వైద్య రంగంలో రెఫరల్ వ్యవస్థ
- పడకేసిన... పుర‘ పాలన’ !
- బరితెగిస్తున్న తెలంగాణ ఎంపీలు
- చరిత్రలో నిలిచిపోతారు
- ఇది సీమాంధ్ర అహంకరం
- మళ్ళీ గ్రూప్ -1 పరీక్ష
- రాజకీయ లబ్ధికోసం తెరాస ఆరాటం
- ఉపాధ్యాయుల ఇక్కట్లు పట్టించుకోండి
- సార్వత్రిక సమ్మెకు మద్దతు
- రాష్ట్రానికి జగన్ అధిపతి కావాలి
- సార్వత్రిక సమ్మెలో ఉపాధ్యాయులు పాల్గొనాలి
- వైఎస్‌ను విమర్శిస్తే ఒళ్లు గుల్లే
- రికార్డు స్థాయిలో వర్షపాతం
- ఉద్రిక్తతల మధ్య గ్రూప్-1
- గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలి
- ‘గ్రూపు’ జగడం స్వరక్షంలో విపక్షం....
- బంగారు భవిష్యత్తు ఇచ్చే బాధ్యత టీచర్లదే
- ఫలించిన పోలీసు వ్యూహం
- గ్రూప్-1 ప్రశ్నా పత్రం లీక్ అయినట్టా... కానట్టా...
- ఏపీపీఎస్సీ చైర్మన్‌ను ఉరితీయాలి
- వద్దన్నా వినలేదు
- కార్మిక ‘భక్షణ’
- పదోన్నతుల షెడ్యూల్ జారీ : పీఆర్టీయు
- ఢిల్లీలో తెలంగాణపై ముగిసిన కాంగ్రెస్ సారధ్య బృందం ప్రదర్శనలు
- ప్రకాశం బ్యారేజికి భారీగా వరద నీరు


























































