Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Style >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
ఫ్యాషన్‌ సిటీలో యువ మోడల్స్‌

హైటెక్‌ సిటీగా ప్రఖ్యాతి చెందిన హైదరాబాద్‌ నగరం నేడు ఫ్యాషన్‌ సిటీగా సైతం పేరుగాంచుతోంది. నగరంలోని పబ్‌లు, స్టార్‌ హోటళ్లు, షోరూంలలో తరచుగా ఫ్యాషన్‌ షోలు జరుగుతున్నాయి. నగరానికి చెందిన పలువురు మోడల్స్‌ దేశంలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు నగరంలో ఫ్యాషన్‌షోలు నిర్వహించాలంటే ముంబయ్‌, బెంగళూర్‌ల నుంచి మోడల్స్‌ను రప్పించాల్సి వచ్చేది. నేడు ఇక్కడి మోడల్స్‌ ముంబయ్‌, బెంగళూర్‌, ఢిల్లీ, చెనై్న తదితర ప్రధాన నగరాల్లో జరుగుతున్న ఫ్యాషన్‌ షోలలో పాల్గొంటుండడం విశేషం. ఫ్యాషన్‌ షోలతో పాటు వివిధ కంపెనీల అడ్వర్టైజ్‌మెంట్‌ల కోసం మోడలింగ్‌ చేస్తున్న యువతీ,యువకులు నేడు నగరంలో ఎందరో ఉన్నారు. ముఖ్యంగా యువతులు ఒకవైపు చదువుకుంటూ, మరికొందరు ప్రైవేట్‌ఉద్యోగాలు చేస్తూ మరోవైపు మోడలింగ్‌ చేస్తుండడం విశేషం.


girl-beatuyమోడలింగ్‌ చేస్తూ సినిమాలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. మరికొందరు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేస్తూ మోడలింగ్‌ చేస్తున్నారు. నేడు నగరంలోని ఫ్యాషన్‌ మోడల్స్‌, గ్లామర్‌ మోడల్స్‌, ఫిట్‌నెస్‌ మోడల్స్‌ దేశంలోని వివిధనగరాల్లో తరచుగా నిర్వహిస్తున్న ఫ్యాషన్‌షోలలో పా ల్గొంటున్నారు. ఇటువంటి కొందరు మోడల్స్‌తో మేజర్‌ న్యూస్‌ మాట్లాడింది. వారు తమ కెరీర్‌ గురించి వివరిం చారు.

శ్వేత, మోడల్‌... నగరానికి చెందిన మోడ ల్స్‌కు నేడు దేశంలో మంచి గుర్తింపు ఉంది. ఇక్కడి మేల్‌, ఫిమేల్‌ మోడల్స్‌ తరచుగా ముంబ య్‌, బెంగళూర్‌, చెనై్న, ఢిల్లీ, కోల్‌కతా తదితర నగరాల్లో జరుగుతున్న ఫ్యాషన్‌ షాలలో పాల్గొం టున్నారు. నాలుగు సంవ త్సరాల క్రితం నేను మోడ లింగ్‌లోకి ప్రవేశించాను. 2006 సంవత్సరంలో జరి గిన మిస్‌ గ్రాసిమ్‌ అందాల పోటీల్లో విజేతగా నిలవడం తో మోడలింగ్‌లో నా కెరీర్‌ ప్రారంభమైంది. 2007 జరిగిన దివా మోడల్‌ హంట్‌లో విజేతగా, 2009లో జరిగిన సన్‌ సిల్క్‌ సౌతిండియా కాంటె స్ట్‌లో మిస్‌ ఎపిగా ఎంపిక య్యారు. ఇక 2009లో నగరంలో జరిగిన కింగ్‌ఫిషర్‌ హంట్‌లో విజేతగా నిలిచాను.

కాగా 2007 సంవత్సరం లో కొంతకాలం పాటు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌ హోస్టెస్‌గా సైతం చేశాను. ఇక గ్రాసిమ్‌ సంస్థ, నగరం లోని లాసెలబ్‌, సిఎంఆర్‌ షోరూంలకు మోడలింగ్‌ చేశాను. ముంబయ్‌, బెంగళూర్‌ తదితర నగరాల్లో జరిగిన ఫ్యాషన్‌ షోలలో పాల్గొంటున్నాను. టాప్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌మల్హోత్రా, ముంబయ్‌కు చెందిన డిజైనర్‌ శ్రేయ, నగరానికి చెందిన డిజైనర్‌ శ్రవణ్‌ల ఫ్యాషన్‌ షోలలో పాల్గొన్నాను. ప్రస్తుతం ఓ కళాశాలో బికామ్‌ ఫైనలియర్‌ చదువుతూనే మోడలింగ్‌ చేస్తున్నాను.

శీతల్‌,మోడల్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌...

beatuy ఒకవైపు మోడలింగ్‌ చేస్తూనే ఫ్యాషన్‌ డిజైనర్‌గా చేస్తున్నాను.మూడు సంవత్సరాల క్రితం మోడలింగ్‌లోకి ప్రవేశించాను. మోడలింగ్‌ ప్రారంభించిన సంవత్స రానికి హిమాయత్‌ నగర్‌లోని హామ్స్‌టెక్‌ ఫ్యాష న్‌ ఇనిస్టి ట్యూట్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులో చేరి సంవత్సరం క్రితం ఈ కోర్సు పూర్తి చేశాను. మోడలింగ్‌ చేస్తూ వచ్చిన డబ్బులతో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సును పూర్తి చేయగలిగాను. ప్రస్తుతం మోడలింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌తో పాటు కొరియోగ్రఫీ కూడా చేస్తు న్నాను. నగరంతో పాటు గోవా, బెంగళూర్‌, విజయవాడ, వైజాగ్‌ నగరాల్లో జరిగిన ఫ్యాషన్‌ షోలలో పాల్గొ న్నాను. బిగ్‌ బజార్‌, ఆర్‌.ఎస్‌. బ్రదర్స్‌, సిటీ సెంటర్‌ తదితర సంస్థలకు మోడలింగ్‌ చేశాను. ఇక సినిమాల్లో సైతం నటిస్తున్నాను. ఇప్పటి వరకు ఆర్య, భవాని ఐపిఎస్‌, గౌరి తదితర సినిమాల్లో చేశాను. యాక్టింగ్‌ కూడా నాకు ఇష్టమే. సిని మాల్లో హీరోయిన్‌గా చేయాలని నా కోరిక.

షామిలీ,మోడల్‌....

modelsగత సంవత్సరన్నర కాలంగా మోడలిం గ్‌ చేస్తున్నాను. నగరంతో పాటు బెంగళూర్‌లో జరిగిన ఫ్యాషన్‌ షోలలో పాల్గొన్నాను. బెంగళూర్‌ ఫ్యాషన్‌ వీక్‌లో ప్రముఖ డిజైనర్లతో కలిసి పనిచేశాను. ఇప్పటివరకు సిఎంఆర్‌, నిసా, వీవ్స్‌, మెబాజ్‌ తదితర షోరూంలకు మోడలింగ్‌ చేశాను. ఇక ఈనెల 22, 23, 24వ తేదీల లో నగరంలో జరిగే హైదరాబాద్‌ డిజైనర్స్‌ వీక్‌లో పాల్గొనబోతున్న నగరానికి చెందిన ఏకైక మోడల్‌ను నేనే. ఈ ఫ్యాషన్‌వీక్‌లో ముంబయ్‌, బెంగళూర్‌ తది తర నగరాల నుంచి ఫ్యాషన్‌ డిజైనర్లు, మోడల్స్‌ రానున్నారు. తిరుమలగిరిలో నివసించే నేను ఉస్మా నియా యూనివర్సిటీలో డిస్టెన్స్‌ ఎడ్యుకే షన్‌లో బిఎస్‌సి ఫైనలియర్‌ చదువుతున్నాను. కాగా మోడలింగ్‌లో రాణిస్తున్న నేను సినీ రంగంలోకి ప్రవేశించాలని కోరుకుం టున్నాను. సినిమా ల్లో నటించేందుకు అవ కాశాలు వస్తు న్నప్పటికీ మంచి ఆఫర్ల కోసం ఎదురుచూ స్తున్నాను.

సలీమ్‌,మోడల్‌... నగరంలో నేడు మోడల్స్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ఒకవైపు ప్రోడక్ట్‌ మోడలింగ్‌తో పాటు మరోవైపు ఫ్యాషన్‌ షోలలో పాల్గొనేందుకు అవకాశాలు లభిస్తున్నాయి. డిగ్రీ పూర్తయిన తర్వాత రెండు సంవత్సరాల క్రితం మోడలింగ్‌లోకి ప్రవేశిం చాను. మోడలింగ్‌తో పాటు యాక్టింగ్‌ చేయాలని నా కోరిక. సిని మాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటివరకు నగరంతో పాటు గోవా, బెంగ ళూర్‌, దుబాయ్‌లలో జరిగిన ఫ్యాషన్‌ షోలలో పాల్గొన్నాను. ప్రముఖ కొరియో గ్రాఫర్‌ ప్ర సాద్‌ బిడప్ప షోలలో తరచుగా పాల్గొంటున్నాను. రెం డు ప్రైవేట్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ లలో సైతం నటించాను. సినిమాల్లో హీరోగా చేయాలని ఉంది.నగర యువత కేవలం మేథోపరంగానే కాదు ఫ్యాషన్‌, మోడలింగ్‌ వంటి విషయాలలో ముందుండడం గర్వించదగిన విషయం.

ఎ.కె

Other News From Style
SURYA Specials |
Weekly Specials |
Advertisement443
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us