Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Style >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
నృత్యంతో... చక్కనైన శరీరాకృతి

అందమైన శరీరాకృతి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా యువత అయితే చెప్పనవసరం లేదు. దాని కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఎవరి వీలును బట్టి వారు కష్టపడతుంటారు. యోగా క్లాసుకు వెళ్లే వారు కొందరైతే, జిమ్‌ల చుట్టూ తిరిగే వారు మరికొంత మంది. ఇలా క్లాసుకు వెళ్లే వెసులుబాటు, తీరిక లేకపోయినా తమ శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును తగ్గించుకునేందుకు ఉదయానే లేచి జాయింగ్‌ చేస్తుంటారు. అయితే వీటన్నింటి కంటే మన భారతీయ శాస్ర్తీయ నృత్యం శరీరానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక బరువును తగ్గించడమే కాకుండా, చక్కని శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చని వివరిస్తున్నారు.


danceశరీరంలోని అదనపు నీటిని, కొవ్వుని తగ్గించాలంటే ఉదయానే మన శాస్ర్తీయ నృత్యాన్ని కాసేపు సాధన చేస్తే సరిపోతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిలో తమిళనాడుకు చెందిన భరతనాట్యం, ఉత్తర భారతదేశంలో ప్రాముఖ్యం పొందిన శాస్త్రీయ నృత్యం కథక్‌, వంటి వాటిని ప్రతి రోజు సాధన చేయవచ్చని వారు చెబుతున్నారు. ‘ఈ శాస్ర్తీయ నృత్యాన్నిఇందులో ఆడ, మగ అని తేడా లేకుండా నేర్చుకోవచ్చు’ అని శాస్ర్తీయ నృత్య గురువు ఆక్సా సింగానియా చెప్పారు. ఈమె ముంబాయిలోని న్రిత్యాలిక డాన్స్‌ ఇనిస్టిట్యూట్‌లో భరతనాట్యాన్ని నేర్పిస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు... శాస్ర్తీయ నృత్యాన్ని సాధన చేస్తే ఆరోగ్యపరమైన అనేక ప్రయోజనాలుంటాయని వైద్యులు అంగీకరిస్తున్నారు. అయితే అనారోగ్యంగా ఉన్నవారు వైద్యుల సలహా మాత్రమే సాధన చేయాలని చెబుతున్నారు. ప్రధానంగా రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ‘ఈ నృత్యంలోని అడుగులు వేగాన్ని, అంతర్గత శక్తిని మెరుగుపరుస్తుంది’ అని క్లాసికల్‌ డ్యాన్స్‌ టీచర్‌ కరిష్మా గోస్వామి చెప్పారు. ఈమె బెంగళూరులోని వెంకటేష నాట్య మందిర్‌లో శిక్షణ అందిస్తున్నారు. శరీరానికి చురుకుదనాన్ని అందిస్తుంది. గుండె రక్తాన్ని వేగంగా సరఫరా చేయడానికి సహాయం చేస్తుందని తెలిపారు.

కాలరీలను ఖర్చు...

అమ్మాయిలే కాదు, అమ్మాయిలు కూడా చాలా మంది కాలరీలను ఖర్చుచేయడానికే వ్యాయామాలు చేస్తుంటారు. ఈ నృత్యాలతో తేలికగా ఖర్చు అవుతుందని నృత్య గురువులు వివరిస్తున్నారు. ప్రతిరోజు క్లాసికల్‌ డ్యాన్స్‌ సాధన చేస్తుంటే అది ఎక్కువ కాలరీలను ఖర్చుచేస్తుంది. వాకింగ్‌, స్విమ్మింగ్‌, సైకిల్‌ తొక్కడం వంటి విధానాల్లో కరిగే కాలరీస్‌ కంటే ఈ డాన్స్‌లో ఎక్కువగా ఖర్చవుతుంది. ముఖ్యంగా డాన్స్‌ నేర్చుకునేటప్పుడు కష్టపడుతన్నామన్నా భావన రాకపోవడం మరో విశేషం. ‘అర్థగంట సమయం పాటు క్లాసికల్‌ డాన్స్‌ సాధన చేస్తే 200 నుంచి 400 కేలరీస్‌ ఖర్చవుతాయి’ అని గోస్వామి చెప్పారు. శాస్ర్తీయ నృత్యంతో శరీరంలో అన్ని భాగాలు కదలికకు గురవుతాయి. దీన్ని సాధన చేయడం వల్ల అధిక బరువును తేలికగా తగ్గించుకోవచ్చు.

కండరాలు పటిష్టం... ప్రత్యేకంగా భరతనాట్యంలో చేతుల కండరాలకు, నరాలకు కొన్ని రకాల కదలికలు పని కల్పిస్తాయి. ‘నృత్యాల్లోని కొన్ని భంగిమలు చేతిలోని కండరాలు, నరాలకు క్రమపద్ధతిలో కదిలిస్తాయి. దాంతో అవి బలంగా తయారవుతాయి. దాంతో మీరు శారీరకంగా ధృడంగా మారుతారు’ అని గోస్వామి అన్నారు.

ఎటుకావాలంటే అటు...

chandlలావుగా ఉన్నవారు శరీరాన్ని ఎటుకావాలంటే అటు వంచలేరు. అయితే కొంతమంది సన్నగా ఉన్న కూడా వంచడానికి ఇబ్బంది పడతారు. అటువంటి వారికి ఈ నృత్యం చాలా ఉపయోగపడుతుంది. కాళ్లు సాఫీగా కదలడానికి తోడ్పడుతుంది. అందుకే ఈ నృత్యంలోని కొన్ని ప్రత్యేకమైన అడుగులు క్రమం తప్పకుండా చేస్తే మీ ఒళ్లు ఎటుకావాలంటే అటు సునాయాసంగా వంగుగలుగతారు. అంతేకాదండోయ్‌... ఎముకలు కూడా బలంగా తయారవుతాయి.

నిపుణుల పర్యవేక్షణలోనే ప్రారంభం... ఎంతో ప్రయోజనాలు ఉన్నాయని శాస్ర్తీయ నృత్యాన్ని నేర్చుకోవాలని తొందరపడి, డీవీడీలను సూచి సాధన చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మొదటి సారి ఈ నృత్యాన్ని సాధన చేసేటప్పుడు మాత్రం అనుభవజ్ఞులైన వారి సూచనలు తీసుకోవాలని వైద్యులు చెప్పారు. కొన్ని రోజుల పాటు గురువుల వద్ద నేర్చుకుని మీకు అనువైన అడుగులు, భంగిమలను తెలుసుకోవాలి. తరువాత ఆ అడుగుల్ని మీరే సొంతంగా నిత్యం సాధన చేసుకోవచ్చని చెబుతున్నారు.ప్రస్తుతం హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు ప్రతి జిల్లాలోనూ శాస్ర్తీయ నృత్యకేంద్రాలున్నాయి. మీకు దగ్గరిలోని నృత్యాలయంలోని అరగంటైనా సాధన చేసి చక్కనైనా శరీరాకృతిని పొందండి.

Other News From Style
SURYA Specials |
Weekly Specials |
Advertisement417
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us