
అధ్యక్ష పీఠం పై... మరో మహిళా నేత ‘చిన్‌చిల్లా ’
రాజకీయాల్లో మహిళలు రాణించడం చాలా అరుదు. అయితే ఈ శతాబ్దంలో రాజకీయాల్లో మహిళల పాత్ర పెరుగుతోందని చెప్పవచ్చు. ఎందరో మహిళ మణులు రాజకీయ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రపంచ దృష్టిని అకర్షించారు. ఆ కోవలో మరో మహిళ చేరారు. మధ్య అమెరికాలోని కోస్టారికా దేశపు అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తొలి మహిళగా చిన్‌చిల్లా చరిత్ర సృష్టించారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఆమె విజయాన్ని లాంఛనంగా ప్రకటిం చారు. రాజకీయాల్లో ధీర్ఘకాల అనుభవం గల చిన్ వ్యక్తిగత జీవితంలోని కొన్ని పార్ష్యాలు‘ ధీర’ పాఠకులకు ప్రత్యేకం.
విజయాల చిన్...
లారా చిన్‌చిల్లా మిరందా కోస్టారికాకు చెందిన రాజకీయ నాయకురాలు. గతంలో వివిధ పదవులు నిర్వహించిన చిన్‌చిల్లా నేషనల్ లిబరేషన్ పార్టీ నుంచి తొలిసారిగా కోస్టారికా అధ్యక్ష స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. కోస్టారికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన ఆస్కార్ ఎరియస్ సన్‌సెంజ్ మంత్రి వర్గంలో ఉన్న ఇద్దరు ఉపాధ్యాక్షుల్లో చిన్‌చిల్ల ఒకరు. దానితో పాటు న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2010 ఎన్నికల్లో నేషనల్ లిబరేషన్ పార్టీ తరుపున అధ్యక్ష స్థానానికి ఆయన చిన్‌ను ప్రతిపాదించడం విశేషం. అధ్యక్ష స్థానానికి తలపడిన చిన్‌చిల్ల అందరీ అంచనాలను తలకిందులు చేస్తూ తనపై పోటీ చేసిన ఇద్దరినీ ఓడించి అద్భుతమైన విజయాన్ని దక్కించు కున్నారు. ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్న మిగతా అభ్యర్థు లపై 47 శాతం ఓట్ల మెజారిటీని సొంతం చేసుకుని విజేతగా అవతరించి చరిత్ర సృష్టించారు.రాజకీయ జీవితం...
చిన్‌చిల్ల కోస్టారికా నేషనల్ లిబరేషన్ పార్టీ నాయకురాలిగా గుర్తింపు పొందారు. అలాగే సోషలిస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గానైజెషన్ సభ్యుర ాలిగా కూడా కొనసాగుతున్నారు.‘ మంచి ప్రపంచం కోసం ప్రగతిశీల రాజకీయాలు చాలా అవసరం’ అనేది ఆమె లక్ష్యం. చిన్‌చిల్లా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే కోస్టారికాలో జరిగిన అనేక సామాజిక కార్యక్రమాల్లోనూ భాగస్వాములయ్యారు. ‘కొలిషన్ ఆఫ్ చర్చ్ లీడర్స్’ ఇతర కొన్ని వర్గాలు 28 నవంబర్ 2009లో నిర్వహించిన వివాదస్పద కార్యక్రమం ‘ మార్చ్ ఫర్ లైఫ్ అండ్ ఫిమెల్’ అనే కార్యక్రమంలో ఆ పార్టీ తరుపున పాల్గొనడమే కాకుంగా తన వాదనను వినిపించిన ఏకైక నాయకురాలిగా చరిత్ర సృష్టించారు. ఈ సంస్థలు హోమో సెక్సువల్ జంటలకు సామాజిక గుర్తింపు నివ్వడంతో పాటు కొన్ని సందర్భాలలో మహిళలు అబార్షన్ కూడా చేసుకోవచ్చని వచ్చిన చట్టాన్ని వ్యతిరే కిస్తూ ఆందోళనను చేపట్టాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్‌చిల్ల విధానాన్ని అక్కడి కొన్ని వర్గాలతో పాటు మానవహక్కుల సంఘాలు సైతం వ్యతిరేకిం చాయి. అయితే ఈ కార్యక్రమం ఏ ఒక్క వర్గాన్నో వ్యతిరేకించడానికి ఉద్ధేశించినది కాదని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా వారికి ప్రత్యేక నియోజక వర్గాలు, కోస్టారికాలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయా లన్న డిమాండ్‌ను సైతం వ్యతిరేకించారు. ఈ విషయం రిపబ్లిక్ ఆఫ్ కోస్టారికాకు చెందిన జాతీయ రోమన్ కాథలిక్‌లోనూ ప్రస్తావించి సంచలనం సృష్టించారు. హోమోసెక్స్‌వల్స్‌కు ప్రత్యేక చర్చ్, రాష్ట్రం ఉండాలన్న ప్రతిపాదనను చట్టం చేయవద్దన్న చిన్‌చిల్ల వాదనకు అధ్యక్షుడు సైతం మద్దతునివ్వడం విశేషం. కోస్టారికాలో ఉన్న ‘మార్నింగ్ అఫ్టర్ పిల్’ అనే చట్టాన్ని సైతం ఆమె వ్యతిరేకించారు.
ఇది గర్భస్రావాలను పోత్సహించే విధంగా ఉందని ఆమె గట్టిగ వాదించారు కూడా. బలవంతపు గర్భస్రావాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం నేరంగా పరిగణిస్తున్న విషయాన్ని చిన్‌చిల్ల గుర్తు చేసింది. గర్భం రాకుండా మాత్రలు వాడడం వేరని, కానీ అప్పటికే గర్భం దాల్చిన మహిళ గర్భాస్రావం కోసం మాత్రలు తీసుకోవడం నేరంగా పరిగణించాలన్నది చిన్ అభిప్రాయం. ఇలాంటి అనేక వివాదస్పద అంశాలనె న్నింటిపైన్నో చిన్ తన ఆందోళను వినిపించి అందరి దృష్టిని అకర్షిం చారు. ‘గే’(పురుషుడు, పురుషున్ని వివాహం చేసుకోవడం) వివాహలను చట్టబద్ధం చేయాలని కొన్ని సంస్థలు డిమాండ్ చేయడాన్ని సైతం ఆమె వ్యతిరేకించారు. ఇలా అనేక వివాద అంశాలలో భాగస్వామి అయిన చిన్ నేడు అధ్యక్షురాలిగా మరెన్ని వివాదాలను పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే.కోస్టారికా గురించి....
కోస్టారికా దేశం మధ్య అమెరికాలో ఉన్న రిపబ్లిక్ దేశం.‘రిచ్ కోస్ట్’ నుంచి కోస్టారికా అనే పదం ఉద్భవించింది. ఈ దేశం 1949లో రిపబ్లిక్‌గా అవతరించింది. కోస్టారికా జనాభా 4.5 మిలియన్లు. మానవ సంబంధాల అభివృద్ధి విషయంలో కోస్టారికా అమెరికాలోని మిగిలిన దేశాలకంటే ముందుంది. మానవ సంబంధాల విషయంలో ప్రపంచస్థాయిలో 54వ దేశంగా గుర్తింపు పొందింది. పర్యావరణ పరిరక్షణ విధానంలో ప్రపంచంలోనే మూడోదేశంగానూ, అమెరికాలో మొదటిస్థానంలోనూ ఉంది. దేశాన్ని ఏడు జిల్లాలుగా విభజించారు. ఇక్కడ మూడు రకాల పరి పాలన విభాగాలు ఉన్నాయి. ఒకటి అధ్య క్షులు, రెండు లెజిేస్లే టివ్ అసెంబ్లీ, 57 మంది లెజిస్లేటివ్ సభ్యులు ఇద్దరు ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఆహార ఎగుమతుల మీదే ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంది. ముఖ్యంగా పైనాపిల్స్, అరటిపండ్ల ఎగుమతులు ఎక్కువ. గడచిన రెండు దశాబ్ధాలుగా టూరిజం రంగం సైతం వృద్ధి చెందింది.ఈ విజయం కోస్టారికా ప్రజలది.- చిన్‌చిల్ల...
నేషనల్ లిబరేషన్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి కోస్టారికా అధ్యక్షురాలిగా విజయం సాధించిన చిన్ మే 8న అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. విజయం సాధించిన అనంతరం చిన్ కోస్టారికా రాజధాని నగరంలో ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు.‘ నా విజయానికి కృషి చేసిన కోస్టారికా మహిళలకు కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను. ఈ విజయం కోస్టారికా ప్రజలందరిదీ. నా ప్రభుత్వం కోస్టారికన్ ప్రజ లందరి నమ్మకాన్ని నిలబెడు తుందని’ హార్షధ్వనాల మధ్య ప్రకటించారు. ఈ ఎన్నిక ల్లో 2.8 మిలియన్ ప్రజలు వారి ఓటు హక్కును విని యోగించుకున్నారు. 57 మంది కాంగ్రెస్ సభ్యులు, 495 మంది కౌన్సిల్ సభ్యు లు కలసి ఇద్దరు ఉపాధ్య క్షులను ఎన్నుకుంటారు. మొత్తం మీద చిన్ తన భావాలను ప్రజలకు సరైన విధంగా చేరవేయడం ద్వారా అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకోగలిగారు. లారా చిన్‌చిల్లా
హోదా : రాజకీయ నాయకురాలు, సామాజిక కార్యకర్త.
ప్రస్తుతం: అధ్యక్షురాలు-కోస్టారికా రిపబ్లిక్
జననం-28 మే 1959(50 సంవత్సరాలు)
పార్టీ- నేషనల్ లిబరేషన్ పార్టీ
నిర్వహించిన పదవులు- ఉపమంత్రి(1994-96),
ప్రజారక్షణమంత్రి(1996-98), దేశ ఉపాధ్యక్షురాలు.
జకోస్టారికా దేశపు అధ్యక్షురాలిగా చిన్‌చిల్లా ఎంపికకాక ముందే అనేకమంది మహిళలు దేశాధినేతలుగా గద్దెలనెక్కడమే కాదు ప్రజల మన్ననలను కూడా అందుకున్నారు. మన దేశంలో నేటికీ మహిళలు అత్యున్నత పదవులను అలంకరించి అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నారు. నేడు భారత దేశ ప్రథమ పౌరుడు ఒక మహిళ. అలాగే దేశంలోని అతిపెద్ద రాజకీయ కూటమికి చైర్‌పర్సన్ మహిళే. ప్రతిపక్ష నేతా మహిళే కావడం విశేషం.వీరందరి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో తన ఉనికిని ఢంకా బజాయించి మరీ చాటుకుం టున్నది. మహిళ సత్తా ఏమిటో ప్రపంచా నికి తెలియచేస్తున్నది. భారత దేశంలోనే కాక ఇప్పటివరకు ప్రపంచంలో అధ్యక్ష స్థానం లేదా ప్రధాని పదవిని అలంకరించిన కొంతమంది మహిళామణులు, వారి హోదాలను ధీర పాఠకుల కోసం.....1.సిరిమావో బండారు నాయకే
శ్రీలంక ప్రధాని-1960-1965, 1970-1977, 1994-2000.
2.ఇందిరాగాంధీ
భారతప్రధాని-1966-77,1980-1984
3.గోల్డా మెయిర్
ఇజ్రాయిల్ ప్రధాని-1969-1974
4.ఇస్బెయిల్ పెరన్
అర్జెంటీనా అధ్యక్షురాలు-1974-1976
5.ఎలిజబెత్ డొమిటియన్
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ప్రధాని- 1975- 1976
6.మార్గరెట్ థాచర్
గ్రేట్ బ్రిటన్ ప్రధాని- 1979-1990
7.మరియా ద లార్డెస్ పింటాసిల్గో,
పోర్చ్‌గల్ ప్రధాని-1979-1980.
8.లిడియా గ్వాలియర్ తెజ్డా
బొలివియా ప్రధాని-1979-1980
9.దామె ఇగ్నియా చార్లెస్
డొమినికా ప్రదాని-1980-1995
10.విగ్దిస్ ఫిన్‌బొగదతుర్
ఐస్‌లాండ్ అధ్యక్షురాలు-1980-1996
11. గ్రో హర్లిమ్ బ్రౌండ్‌లాండ్
నార్వేప్రధాని-1981, 1986-1989, 1990-1996
12.సూంగ్ చింగ్‌లింగ్
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా గౌరవ అధ్యక్షురాలు -1981
13.మిల్కా ప్లానిక్
యుగోస్లివియా- ఫెడరల్ ప్రధాని-1982-1986
14.అగథా బర్‌బరా
మాల్థా అధ్యక్షురాలు- 1982-1987
15 మరియా లైబెరియా-ఫిటర్స్
నెదర్లాండ్ ప్రధాని-1984- 1986,1988- 1993
16.కొరిజానో అక్వినో
ఫిలిప్పెన్స్ ప్రధాని-1986-1992.
17.బెనజీర్ భుట్టో
పాకిస్తాన్ ప్రధాని- 1988-1990, 1993-1996
18.కాజిమెయిరా దనుతా ప్రున్స్‌కెయినా
లూథియానా ప్రధాని-1990-91
19.వయోలెటా బర్రిస్ దె చమర్రో
నికరగుయ- ప్రధాని-1990-1996.
20.మేరి రాబిన్‌సన్
ఐర్లాండ్ ప్రధాని-1990-1997
21.ఎర్తా పాస్కల్ ట్రోలియట్
హైతీ తాత్కలిక అధ్యక్షురాలు- 1990-1991
22.సబినెబెర్గమన్
-జర్మన్‌డెమోక్రటిక్ రిపబ్లిక్ అధ్యక్షురాలు-1990
23.అంగ్ సాన్ సూకీ
మయన్మార్ ప్రధాని (పదవి చేపట్టక ముందే ఆర్మీ పాలన విధింపు)
24. ఖలీదా జీయా,
బంగ్లాదేశ్ ప్రధాని- 1991-1996
25.ఎడిత్ క్రిస్సన్,
ఫ్రాన్స్ ప్రధాని-1991-1992
26. హన్నా సుచోక
పోలాండ్ ప్రధాని-1992-1993.
27.కిమ్ కాంపెల్
కెనడా ప్రధాని-1993
28.సైలివ్ కినిగి
బురింది ప్రధాని -1993-1994.
29.అగథా రవంధా
ప్రధాని, 1993-1994.
30.సుసన్నే కెమిలియా రొమర్
నెదర్లాండ్ -ప్రధాని 1993,1998
31.టన్సు కిల్లర్
టర్కీ ప్రధాని-1993-1995
32.చంద్రికా బండారునాయకే
కుమార తుంగె
- శ్రీలంక ప్రధాని-1994.
33.రెనిటా ఇండ్జోవా
బల్గేరియా ప్రధాని-1994-1995.
34.క్లౌడెట్టా వెర్‌లైట్
హైతి ప్రధాని 1995-1996.
35.షేక్ హసీనా వాజిద్
బంగ్లాదేశ్-ప్రధాని 1996.
36.మెరీ మక్‌లీ
ఐర్లాండ్ అధ్యక్షురాలు -1997
37.ఫమీలా గర్డన్
బెర్మూడా, ప్రధాని 1997-1998.
38.జనెత్ జగన్,
గయానా, ప్రధాని -1997, అధ్యక్షురాలు- 1997-1999.
39.జెన్నీ సిప్లె
న్యూజిలాండ్ ప్రధాని,1997-1999.
40.రుత్ డ్రెపుస్
స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు-1999-2000.
41.జెన్నిఫర్ స్మిత్
బెర్మూడా-1998
42.నయిమ్ ఓసరియన్ థూయ
మంగోలియా- ప్రధాని-1999
43.హెలెన్ క్లర్క్
న్యూజిలాండ్ ప్రధాని-1999-
44.మెరియా ఎలిసా మాస్కో దె ఎరియస్
ఫనామా -అధ్యక్షురాలు- 1999-
45.వైరా వికె ఫెర్బిర్గా
లత్వియా అధ్యక్షురాలు- 1999-
46. తర్జా కరీనా హలోనెన్
ఫిన్లాండ్ అధ్యక్షురాలు-2000
Other News From Dheera


























































