Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Dheera >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
మేకప్‌ వేసుకునే ముందు ఆలోచించండి ...

makeup-foundationచాలా మందికి మేకప్‌ వేసుకోవడం ఇష్టం. కానీ పద్ధతులు తెలియవు. మరీ ఉత్సాహవంతులు దానిని ఉపయోగించడం పూర్తిగా తెలియకుండానే వేసుకొని నిరాశ పడుతుంటారు. అందుకే మేకప్‌ వేసుకునేముందు దాని గురించి కొంత పరిజ్ఞానం అవసరం. మన మేనిఛాయ, మనం వేసుకునే దుస్తులు, సందర్భం ఇలాంటి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేకప్‌ను వాడటం మంచిది.మనం మేకప్‌ వేసుకునే సమయంలో సాధారణంగా చేసే తప్పు, తప్పుడు ఫౌండెషన్‌ను ఎంచుకోవడం. తప్పుడు షేడ్‌ను ఎంచుకోవడం వల్ల ముఖం చాలా బీభత్సంగా కనిపిస్తుంది.

తెల్లగా ఉన్న వారు లైటర్‌ షేడ్‌లను ఉపయోగించడం వల్ల మాస్క్‌ వేసుకున్నట్టుగా ఉంటుంది తప్ప సహజంగా ఉండదు. సాధారణంగా ఫౌండెషన్లు పసుపు, పింక్‌ టోన్లలో దొరుకుతాయి. కనుక మనకు ఏది సూట్‌ అవుతుంది అన్నది ముంచేతి మీద రాసుకుని చూసుకుని మరీ తీసుకోవాలి. అంతే తప్ప పక్కవారు ఉపయోగించారు కనుక మనం కూడా అదే షేడ్‌ తీసుకుందాం అనుకుంటే అంతిమ ఫలితం బాధాకరంగా ఉంటుంది. అలాగే ఫౌండేషన్‌కు తగ్గ పౌడర్‌ షేడ్‌ను కూడా ఎంచుకోవాలి. సాధారణంగా కాంపాక్ట్‌ పౌడర్లలో కూడా మనకు రకరకాల షేడ్స్‌ దొరుకుతాయి. కనుక వాటిలో మన ఫౌండేషన్‌కు సరిపోయే వాటిని ఎంచుకొని ఉపయోగించాలి.

lipstickకంటికి షేడ్స్‌ వేసుకుని వాటిని తీర్చి దిద్దుకునే సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్ళకు పెట్టుకునే కాటుక, ఐషేడ్‌ సవ్యంగా వేసుకుంటే దేవతలాగే కనిపిస్తారు. కాస్త అటూ ఇటూ అయితే మాత్రం చెప్పనవసరం లేదని మేకప్‌ నిపుణులు అంటున్నారు. చిన్న కళ్ళు ఉన్న వారు తమ కళ్ళు పెద్దగా కనిపించడం కోసం ఎక్కువ కాటుక పెట్టడం లేదా షేడ్లు వాడటం చేస్తుంటారని అయితే ఫలితం అనుకున్న దానికి విరుద్ధంగా ఉంటుందని వారంటున్నారు. ముఖ్యంగా స్మోకీ ఎఫెక్ట్‌ కోసం చిన్న కళ్ళున్న వారు ప్రయత్నం చేయరాదని వారంటున్నారు. ఆ ప్రయత్నం వారి కళ్ళను మరింత చిన్నగా కనిపించేలా చేస్తాయని వారు చెప్తున్నారు.

మేకప్‌లో మరో ముఖ్యమైన అంశం లిప్‌స్టిక్‌ ధరించడం. ఫౌండెషన్లలాగే లిప్‌స్టిక్‌ షేడ్స్‌ కూడా మన స్కిన్‌టోన్‌తో సరిపోయినపుడే దాని అందం ఇనుమడిస్తుంది. అలా కాకుండా మనకు నచ్చిన షేడ్‌ అనో లేక రంగు బాగుందనో వాడేస్తే మాత్రం మేకప్‌ కోసం మీరు పడ్డ శ్రమను మొత్తం వృధా అయిపోతుందని వారంటున్నారు. మీరు వేసుకున్న మేకప్‌తో, పాటు సాఫ్ట్‌గా రంగులను వాడటం వల్ల ముఖానికే అందం వస్తుంది. లేదంటే ముదురు రంగులతో బీభత్సంగా కనిపించే అవకాశముంటుంది.మేకప్‌లో చివరగా వేసుకునే మస్కారా విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్ళే ముందు కనురెప్పలకు చక్కగా అంటేలా వేసుకోవాలి. అంతేకాని, గబగబా ఒక కోటింగ్‌ వేసుకుంటే దాని అందం తెలియదని నిపుణులు చెప్తున్నారు.

make_upబజారులో ఇప్పుడు రకరకాల కంపెనీల మేకప్‌ ఉత్పత్తులు దొరుకుతున్నాయి. భిన్నమైన షేడ్స్‌, వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో నుంచి ఎంపిక చేసుకోవాలి. మేకప్‌ వస్తువులు వాడేటప్పుడు ఖరీదు కొంచెం ఎక్కువైనా అటువంటి ఉత్పత్తులనే కొనుగోలు చేయడం మంచిది. అలాగే మేకప్‌ సామాగ్రిని సంవత్సరాలు, సంవత్సరాలు దాచి వాడటం మంచిది కాదు. ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు మాత్రమే వాటిని వాడటం వల్ల చర్మానికి ఎటువంటి హానీ జరుగదు.

కనుక ఈ కాసిని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ముఖాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. అంతే తప్ప పక్కింటి వారు చేశారనో, కొలీగ్‌ చేసిందనో దానినే అనుకురిస్తే మన పర్సనాలిటీయే దెబ్బతినే అవకాశముంటుంది. అందమంటే కేవలం గ్లామరస్‌గా కనిపించడం కాదు. మనకు చక్కగా నప్పే విధంగా తయారవడం మన అందాన్ని ఇనుమడిస్తుంది. అంతే తప్ప మేకప్‌ ద్వారా కొత్త అందాలను కొని తెచ్చుకోవాలని ప్రయత్నిస్తే భంగపడడం తప్ప మరొకటి ఉండదు. అందుకే డ్రెసింగ్‌ కానీ మేకప్‌ కానీ మన శరీరాకృతికి, మన రంగుకి నప్పేలా ఉండాలి. అప్పుడు అందంతో పాటు హుందాతనం కూడా మనకు వస్తుంది.

Other News From Dheera
SURYA Specials |
Weekly Specials |
Advertisement473
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us