
యువతను వెర్రిక్కిస్తున్న సిక్స్‌ప్యాక్
గజినీ హిందీ సినిమాలో సిక్స్‌ప్యాక్ బాడీతో అమీర్‌ఖాన్ ప్రేక్షకులను మైమరపించాడు. ఓంశాంతి ఓం సినిమాలో షారూఖ్‌ఖాన్ సిక్స్‌ప్యాక్‌తో అభిమానులను అబ్బురపరిచాడు. ఇటీవలే విడుదలైన వీర్ ిసినిమాలో సల్మాన్‌ఖాన్, ముద్దుల హీరో ఇమ్రాన్‌హష్మీ ఒక హిందీ సినిమాలో సిక్స్‌ప్యాక్ గెటప్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాల్లో తమ అభిమాన హీరోల సిక్స్‌ప్యాక్ బాడీని చూసి యువకులు తమ బాడీని సిక్స్‌ప్యాక్‌గా మలిచేందుకు జిమ్‌లవైపు పరిగెత్తుతున్నారు. తమ తోటివారిని ఆకట్టుకోవడానికి సిక్స్‌ప్యాక్ బాడీని మించింది లేదని కొందరు యువకులు నేడు భావిస్తుండడం విశేషం.
యూత్ నేడు ఫిట్‌నెస్ మంత్రాన్ని జపిస్తున్నారు. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండేందుకు కొందరు యువకులు ప్రతిరోజు జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇక ఎక్సర్‌సైజులు చేస్తూ కేవలం ఫిట్‌గానే ఉండడం కాదు తమ శరీర దారుఢ్యాన్ని పెంచేందుకు ఎక్కువగా వ్యాయామాలు చేస్తున్నారు. ధృడమైన శరీరంతో సిక్స్‌ప్యాక్ బాడీని పొందాలని వారు తాపత్రయపడుతున్నారు. నేడు సిక్స్‌ప్యాక్ ట్రెండ్ కొనసాగుతోంది. కఠినమైన ఎక్సర్‌సైజులతో సిక్స్‌ప్యాక్.. సిక్స్‌ప్యాక్ బాడీ పొందడం అంత ఈజీ కాదని ఫిట్‌నెస్ నిపుణులు సెలవిస్తున్నారు. ఈ బాడీ కోసం తీవ్రమైన కసరత్తులే కాదు ఆహార నియమాలు కూడా తప్పనిసరని వారు చెబుతున్నారు.సిక్స్‌ప్యాక్ కోసం కడుపులోని మజిల్స్‌ను ధృడపరచి కొవ్వును పూర్తిగా తగ్గించాల్సి ఉంటుంది. ఇందు కోసం కఠినమైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. వాస్తవంగా ఒకవైపు ఎక్సర్‌సైజులు చేస్తూనే మరోవైపు తీసుకునే ఆహారం విషయంలో పూర్తి శ్రద్ద వహించాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం, సాయ్రంతం వేళల్లో కనీసం నాలుగు, అయిదు గంటల పాటు ఎక్సర్‌సైజులు చేయాల్సి ఉంటుంది. జిమ్‌లలో పట్టుదల, ఓపికతో వ్యాయామాలు చేయాలి. ప్రతి మనిషి కడుపులో మజిల్స్ ఉంటాయి. అవి పైన ఉన్న కొవ్వు మూలంగా బయటకు కనిపించవు. సిక్స్ ప్యాక్ ఎక్సర్‌సైజులతో కడుపులోని కొవ్వును పూర్తిగా కరిగించడంతో అవి ధృడంగా మారి ఆరు ప్లేట్ల మాదిరిగా బయటకు అగుపిస్తాయి.
సిక్స్‌ప్యాక్ కోసం పలు రకాల ఎక్సర్‌సైజులను చేయాలని ఫిట్‌నెస్ ట్రైనర్స్ చెబుతు న్నారు. శరీరంలోని అన్ని భాగాలను ధృడపరిచేందుకు ఈ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. వీటిలో అబ్డామినిస్, స్క్వాట్స్, క్రంచెస్, సిటప్స్, లెగ్ లిఫ్ట్స్, జాక్‌నైఫ్ సిటప్స్, వి అప్స్, డంబుల్స్, వెయిట్ లిఫ్టింగ్స్, తదితర ఎక్సర్ సైజులను చేయాల్సి ఉంటుంది. కడుపులోని రెక్టస్ అబ్డామినిస్‌ను ధృడంగా తీర్చిదిద్దేందుకు స్క్వాట్స్, అబ్డామినిస్ ఎక్సర్‌సైజులను చేయాల్సి ఉంటుంది. నడుమును సన్నపరిచి వెన్నెముకకు సమాంత రంగా బాడీని ధృడపరచాల్సి ఉంటుంది. స్క్వాట్స్‌తో పాటు డెడ్‌లిఫ్ట్స్ ఎక్సర్‌సైజులు ఇం దుకు తోడ్పడతాయి. ఈ ఎక్సర్‌సైజులతో కడుపు వద్ద ఉన్న ఫ్యాట్ పూర్తిగా కరిగిపోతుంది.
ఇక క్రంచెస్ ఎక్సర్‌సైజులను చాతి, భుజాలను ధృడపరిచేందుకు చేస్తారు. నేలపై పడుకొని కాళ్లు, చేతులను వంచుతూ ఈ ఎక్సర్‌సైజులను చేస్తారు. ఈ వ్యాయామా లతో శరీరంలోని అన్నిభాగాలు చైతన్యవంతమై కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది. కాళ్లను ధృడపరిచేందుకు లెగ్ లిఫ్ట్స్‌ను చేస్తారు. సైక్లింగ్‌తో పాటు జిమ్‌లో కాళ్లను ధృడ పరిచే ఎక్విప్‌మెంట్స్‌తో ఈ ఎక్సర్ సైజులు చేస్తారు. ఇక జాక్ నైఫ్ సిటప్స్, వి అప్స్ ఎక్సర్‌సై జులు బాడీని సిక్స్‌ప్యాక్‌గా మలి చేం దుకు తోడ్పడతాయి. డంబు ల్స్, వెయిట్ లిఫ్టింగ్స్ ఎక్సర్ సైజులను ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్సర్‌సైజులతో బాడీలోని వివిధ శరీరభాగాలు ధృడమైన ఆకృతిలో చక్కగా తీర్చి దిద్దబడతాయి. ఇవేగాకుం డా ఇటీవల కాలంలో చేస్తున్న సైంటిఫిక్ బెస్ట్ ఆబ్స్ ఎక్సర్‌సై జలు శరీరాన్ని మరింత బలం గా మారుస్తాయి. మజిల్స్‌ను డెవలప్‌చేసేందుకు వెయిట్ లిఫ్టింగ్స్, డంబుల్స్ ఎక్సర్ సైజులు చాలా ఉపయోగపడతాయి. కాగా కొందరు ఈ ఎక్సర్‌సైజులు తక్కువ చేసి రన్నింగ్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ ఆడడం చేస్తారు. దీంతో బలమైన మజిల్స్ తగ్గుతాయి. ఇక ఎప్పటికప్పుడు శరీరాకృతిని అద్దంలో చూసు కుంటూ దానికి తగ్గట్టుగా బాడీని ధృడంగా మలిచేందుకు ఎక్సర్‌సైజులను చేయాల్సి ఉంటుంది. సిక్స్‌ప్యాక్ ఎక్సర్‌సైజులు శరీరంలోని మజిల్స్‌ను ధృడంగా చేసి కొవ్వును తగ్గించి బాడీ సైజు ఎక్కడ ఎంత ఉండాలో ఆ మేరకు తీర్చిదిద్దుతాయి. తీవ్రమైన ఎక్సర్ సైజుల మూలంగా ఏర్పడే స్ట్రెస్‌ను తగ్గించేందుకు యోగా, ధ్యానం వంటివి చేస్తే శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండవచ్చు. ఇక ఎక్సర్‌సైజులు చేసేముందు ఫుడ్, మిల్క్ తీసుకోకూడదు. ఎక్కువగా ఆహారాన్ని తీసుకున్న వెంటనే ఎక్సర్‌సైజులు చేయడం మంచిది కాదని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. ఎక్సర్‌సైజులు చేస్తున్న కాలంలో కొందరికి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.
దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం మేలు.క్రమబద్ధమైన ఆహార నియమాలు..సిక్స్‌ప్యాక్ కోసం ఎక్సర్‌సైజులతో పాటు ఆహారనియమాలు తు.చ. తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. డైట్ కంట్రోల్ ద్వారా 80 శాతం కొవ్వును తగ్గిస్తే ఎక్సర్‌సైజుల ద్వారా 20 శాతం కొవ్వును కరిగించవచ్చని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యం గా రాత్రిపూట తీసుకునే డిన్నర్‌ను పూర్తిగా నియంత్రించాల్సి ఉంటుంది. ఇందు కోసం ‘ఈట్ క్లీన్’ ఆహారాన్ని తీసుకోవాలని వారు సెలవిస్తున్నారు. తీసుకునే ఆహారంలో 50 శాతం పండ్లు, కూరగాయలు ఉండేవిధంగా చూసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు లో కాలరీ స్నాక్స్‌ను తీసుకుంటే మంచింది. డిన్నర్‌లో ఎక్కువగా అవసరానికి మించి ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. తినగానే పడుకో వడం మంచిది కాదు. తినగానే పడుకుంటే తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని డిన్నర్ పూర్తయిన రెండు గంటల తర్వాత పడుకుంటే ఆరోగ్యానికి మంచిది.
ఇక రాత్రిపూట అన్నిటికంటే బెస్ట్ ఫుడ్ పం డ్లు, కూరగాయలను తీసుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. తినేముందు ఒక పెద్ద గ్లాస్‌మంచి నీళ్లు తీసుకోవాలని డైట్ నిపుణులు చెబుతు న్నారు. సిక్స్‌ప్యాక్ ఎక్సర్‌సైజులు చేసేవారు ఫైబర్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, కూరగా యలు, పప్పు దినుసుల్లో ఫైబర్ ఎక్కువగా ఉం టుంది. ఇక చాలా మంది బ్రేక్ ఫాస్ట్ తీసుకోరు. ఇది మంచిది కాదని డైట్‌నిపుణులు అంటున్నా రు. ఉదయం టిఫిన్ చేయకుండా చాలా మంది మధ్యాహ్నం లంచ్‌చేస్తుంటారు. రాత్రి డిన్నర్ పూర్తయిన తర్వాత దాదాపు 12 గంటల తర్వాత లంచ్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా లంచ్‌లో చాలామంది ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. దీంతో శరీరంలోని జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయక తీసు కున్న ఆహారం సరిగా జీర్ణం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. సిక్స్‌ప్యాక్ ఎక్సర్‌సైజులు చేసే వారు అవసరమైన మేరకు కాలరీల ఆహా రాన్ని తినాల్సి ఉంటుంది. ఇక ప్రతిరోజు ఎక్కువ మంచినీరు తీసుకోవడం అన్ని విధాలా మంచిదని డైట్‌నిపుణులు చెబుతున్నారు.
శరీర బరువును బట్టి నీళ్లు తాగాల్సి ఉంటుంది. శరీర బరువు 20 కిలోలకు ఒక లీటర్ మంచినీరు చొప్పున ఎంత బరువు ఉంటే అన్ని లీటర్ల నీటిని తప్పని సరిగా తాగాల్సి ఉంటుంది. శరీరాన్ని మరింత హుషారుగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు మంచినీరు తోడ్పడుతుంది. శరీరంలోని 55 శాతం నుంచి 78 శాతం బరువు నీటిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎక్కువ నీటిని తీసుకోవడం శ్రేయస్కరం. ఇక గ్రీన్ టీ తీసుకోవడంతో శరీర మెటబాలిజమ్ క్రమబద్దీకరించబడు తుంది. వైట్ ఫుడ్‌ను తగ్గించడంతో శరీరంలోని కొవ్వును పూర్తిగా నియంత్రించ వచ్చని డైట్ నిపుణులు తెలియ జేస్తున్నారు. వైట్‌రైస్, షుగర్ తదితరాలు బాడీలో కొవ్వు శాతాన్ని పెంచుతాయి. అన్నాన్ని తగ్గించే రొట్టెలు తీసుకోవడం శ్రేయస్కరం. ఇక ఆహారంలో ఉప్పు శాతాన్ని కూడా తగ్గిం చడం మంచిది. ఇక తీసుకునే ఆహార సమయాలను కరెక్ట్‌గా పాటించాల్సి ఉంటుంది. ఆహారంతో పాటు తగినంత నిద్ర శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఇక ఎక్సర్‌సైజులు చేసే గంట ముందు ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్ కాఫీని తీసుకోవడం మంచిది. దీంతో ఎక్సర్‌సైజులు చేసినప్పుడు శరీరంలోని అనవసర కొవ్వు పూర్తిగా తగ్గుతుంది. ఇక ఎక్సర్‌సైజులు చేసే సమయంలో ఎక్కువగా మంచినీరు తీసుకోవడం కూడా శ్రేయస్కరం. ఇక షుగర్ శాతం ఎక్కు వగా ఉండే స్వీట్లను పూర్తిగా తగ్గించాలి. ఇక టివి చానెల్స్‌లో చూపించే అబ్ మిషన్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. తక్కువ సమయంలో శరీరాన్ని ధృడపరిచి సిక్స్‌ప్యాక్‌గా తీర్చిదిద్దుతుందని చానెల్స్‌లోని అడ్వర్టైజ్‌మెంట్‌లలో చెబుతుంటారు. వీటిని నమ్మకుండా ఒక క్రమపద్దతి లో ఎక్ససై ైజులు చేయడం మంచిదని గమనించాలి. కొన్ని రకాల డ్రగ్స్‌ను తీసుకుంటే బాడీబిల్డింగ్, సిక్స్‌ప్యాక్‌ను పొందడం సులభమని యాడ్స్‌లో చెబు తుంటారు. వీటిని నమ్మకుండా వీటిని తీసుకునేముందు డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది.
సిక్స్‌ప్యాక్ హీరోలు..సినిమాల్లో తమ అభిమాన హీరోల సిక్స్‌ప్యాక్ బాడీని చూసి వారి అభిమానులు మురిసిపోతున్నారు.హీరోల మాదిరిగా తాము కూడా సిక్స్‌ప్యాక్‌తో ధృడంగా కనిపిం చాలని యువకులు తహతహలాడుతున్నారు. బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ గజినీ సినిమా కోసం సిక్స్‌ప్యాక్ బాడీని పొందేందుకు తీవ్రమైన ఎక్సర్‌సైజులు చేశాడు. చివరికి కొన్ని నెలలపాటు కఠిన ఎక్సర్‌సైజులు చేసి, ఆహారనియమాలను పాటించి ఈ వెరైటీ హీరో సిక్స్‌ప్యాక్ బాడీని పొందాడు. ఈ బాడీతో తెరపై కనిపించి అభిమానులను ఉర్రూతలూగించాడు. ఇక కింగ్‌ఖాన్ షారూఖ్‌ఖాన్ ఓం శాంతి ఓం సిక్స్‌ప్యాక్‌తో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. సినిమాలోని ఓ పాటలో అందాలభామల మధ్య ధృడమైన సిక్స్‌ప్యాక్‌తో యువకులను మైమరపించాడు. ఇటీవల విడుదలైన వీర్ సినిమాలో కండల వీరుడు సల్మాన్‌ఖాన్ సిక్స్‌ప్యాక్ బాడీతో మెరిసాడు. ధూమ్ 2లో సినిమాలో హీరో హృతిక్ రోషన్ సిక్స్‌ప్యాక్ బాడీతో యువతీ, యువకులను ఆకట్టుకున్నాడు.
ఇక ముద్దుల హీరోగా పేరుగాంచిన ఇమ్రాన్ హష్మీ, ఒకప్పటి కరీనాకపూర్ బాయ్‌ఫ్రెండ్ షాహిద్‌కపూర్‌లు తమ బాడీని సిక్స్‌ప్యాక్‌గా డెవలప్‌చేసి సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక దక్షిణాదిన సైతం సిక్స్‌ప్యాక్ ట్రెండ్ కనిపించింది. తెలుగు, తమిళంలో సూపర్‌హిట్ సాధించిన గజినీ సినిమాలో హీరో సూర్య సిక్స్‌ప్యాక్‌తో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా హిందీ రీమేక్‌లో సూర్య మాదిరిగా సిక్స్‌ప్యాక్ బాడీతో అమీర్‌ఖాన్ కనిపించాడు. హీరోలు నితిన్, విశాల్‌లు సైతం సిక్స్‌ప్యాక్ క్లబ్‌లో మెంబర్సే. వీరు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సైతం సిక్స్‌ప్యాక్ కోసం కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం.
పట్టుదల, ఓపికతో సిక్స్‌పా్‌య సాధ్యమే
పట్టుదల, ఓపికతో సిక్స్‌ప్యాక్ బాడీని సాధించవచ్చని ఫిట్‌నెస్ ట్రైనర్ దీపక్ తెలిపారు. నేడు పలువురు యువకులు సిక్స్‌ప్యాక్ బాడీ కోసం తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారని కానీ కొంతకాలం చేసిన తర్వాత ఎక్సర్‌సైజులను మధ్యలోనే ఆపేస్తున్నారని చెప్పారు. యువకులు జిమ్‌లలో ఫిట్‌నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో వ్యాయామాలు చేస్తే మంచిదని తెలిపారు. ఒక క్రమపద్దతిలో సిక్స్‌ప్యాక్ ఎక్సర్‌సైజులు చేస్తూ ఆహారనియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందన్నారు. ఇక ఎక్సర్‌సైజులు చేస్తున్న కాలంలో ఏవైనా ఆరోగ్యసమ్యలు తలెత్తితే వెంటనే డాక్టర్లను సంప్రదించడం శ్రేయస్కరమని తెలిపారు.
ఎస్. అనిల్ కుమార్
Other News From Colours


























































